Home

»

Latest News

స‌మంత‌కు చైతూ ప‌ర్మిష‌న్ ఇచ్చేశాడు

Oct 3, 2016 6:24PM

పెళ్ల‌య్యాక స‌మంత న‌టిస్తుందా?  సినిమాల‌కు దూరం అవుతుందా?  ఈ విష‌యంలో అక్కినేని కుటుంబం ఏం ఆలోచిస్తోంది?  స‌మంత మ‌న‌సులో ఉన్న మాటేంటి?  ఈ విష‌యంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పెళ్ల‌య్యాక కూడా స‌మంత క‌థానాయిక‌గా కొన‌సాగుతుంద‌ని కొంద‌రు, లేదు లేదు... అందుకు నాగ్ ఒప్పుకోవ‌డం లేద‌ని మ‌రికొంద‌రు చెప్పుకొంటున్నారు. దాంతో స‌మంత రిటైర్‌మెంట్ విష‌యంలో పెద్ద ఎత్తున డిబేట్ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో నాగ‌చైత‌న్య క్లారిటీ ఇచ్చేశాడు. ఈ అనుమానాల‌కు తెర‌దించాడు. స‌మంత పెళ్ల‌య్యాక కూడా న‌టిస్తుంద‌ని, ఈ విష‌యంలో త‌న‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని తేల్చి చెప్పేశాడు. సో.. స‌మంత ఇప్ప‌ట్లో రిటైర్ అవ్వ‌ట్లేద‌న్న‌మాట‌.

వ్య‌క్తిగ‌త జీవితం, వృత్తిగ‌త జీవితం రెండూ వేర్వేర‌ని, వాటిని క‌లిపి చూడొద్ద‌ని, స‌మంత మంచి న‌టి అని తాను సినిమాల్లో టాప్ క‌థానాయిక‌గా కొన‌సాగ‌డం త‌న‌కెంతో గ‌ర్వంగా ఉంద‌ని చెబుతున్నాడు చైతూ. మొత్తానికి స‌మంత‌కు రూట్ క్లియ‌ర్ అయిపోయింది. సినిమాల్లో స‌మంత త‌న ప్ర‌భంజ‌నం కొన‌సాగించ‌డం ఖాయం. అన్న‌ట్టు ఇటీవ‌ల స‌మంత ఓ ఘాటు ఫొటో షూట్ లో పాల్గొంది. వాటికి సంబంధించిన స్టిల్స్ ఒకొక్క‌టీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. స‌మంత ఎప్పుడైతే ఫొటో షూట్‌లో క‌నిపించేందుకు ముందుకొచ్చిందో, అప్పుడే స‌మంత సినిమాల్ని వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పింది. ఇప్పుడు చైతూ స్టేట్‌మెంట్‌తో దానికి బ‌లం చేకూరిన‌ట్టైంది. స‌మంత సినిమాల్లో న‌టిస్తే  మ‌రి నాగ్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com