Home

»

Latest News

అందాల రేస్‌లో హాట్ యాంకర్స్..!

Sep 30, 2016 2:24PM

గతంలో యాంకర్లు అంటే బుల్లితెర మీద ప్రేక్షకులను అలరించడమో లేదంటే ఆడియో వేడుకల్లో సందడి మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి. నటన అయినా..అందాల అరబోతలో అయినా తెలుగు యాంకర్లు..హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు. హాట్ హాట్ అందాలతో బుల్లితెరను షేక్ చేసిన అనసూయ..క్షణం, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలు చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఇక అనసూయ ఖాళీ చేసిన కుర్చీలో పాగా వేసిన రష్మీ గౌతమ్ కూడా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. నిజం చెప్పాలంటే రష్మీ కోసమే ఆ సినిమాలు నిర్మించారా అన్నట్లు ఆమె హవా నడిచింది..ఇంకా నడుస్తోంది.

ఇప్పుడు తాజాగా వీరి బాటలో నడవటానికి సిద్ధంగా ఉంది శ్యామల. ఆకట్టుకునే అందం, చక్కటి మాటతీరుతో ఈ మధ్య తన పాపులారిటీని బాగానే పెంచుకుంది శ్యామల. యాంకరింగ్‌లో తన కంటే జూనియర్లయిన అనసూయ, రష్మీలు వెండితెరపై దూసుకెళ్తుండటంతో ఈవిడ కూడా తన ఫోకస్‌ని సినిమాలపై పెట్టాలని డిసైడ్ అయ్యిందట. ఇప్పటికే భారీ చిత్రాల ఆడియో ఫంక్షన్స్‌లో హోస్ట్‌గా చేస్తుండటంతో సినీ ప్రముఖుల దృష్టిలో బాగానే నోటెడ్ అయ్యింది. గతంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన శ్యామల భారీ ఆఫర్ కోసం ఎదురుచూస్తోంది.  మరి ఆ ఆఫర్ ఎప్పుడు వస్తుందో..? 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com