Home

»

Latest News

మూవీ ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం: అక్కడ ఇక బంద్!

Nov 11, 2026 11:27AM


మేకర్స్ తమ సినిమా ప్రమోషన్స్ కి అదనపు హంగులు, సొగసులు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఉంటారు. అందుకే ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ ని జెన్ జీ బ్యాచ్ కి చేరువ చెయ్యాలని కళాశాలల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై సినిమా ప్రమోషన్లు మరియు ప్రైవేట్ వాణిజ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వం అత్యంత కీలకమైన  నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా సంచలనం అని చెప్పవచ్చు.

విద్యాసంస్థల ప్రాంగణాలను కేవలం విద్య మరియు క్రీడా కార్యకలాపాలకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో జరిగిన వరుస ప్రమాదాలు, విద్యార్థుల భద్రతను గాలికొదిలేసి నిర్వహించిన ఈవెంట్లు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు మరియు చర్చకు దారితీశాయి.

ముఖ్యంగా, నాదర్‌గూల్‌లోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన 'దాండియా నైట్' (Dandiya Night) ఈవెంట్ సందర్భంగా 80 అడుగుల తాత్కాలిక లైటింగ్ స్ట్రక్చర్ కుప్పకూలిన ఘోర ప్రమాదంలో ఒక మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, కనీసం 14 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

అంతేకాకుండా, అక్టోబర్ 23న మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన వెంకటేష్ నటించిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమా ప్రమోషన్ల జోరు పెరగడం, విద్యార్థులను అక్టోబర్ 30న సినిమా విడుదల రోజున థియేటర్లకు వెళ్లాలని కోరుతూ సెలవు ప్రకటనపై జరిగిన చర్చలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

ఇది కూడా చదవండి:ఎవరు ఊహించని జోనర్ లో సూర్య కొత్త మూవీ!

 ఈ నేపథ్యంలో  యాజమాన్యాల తీరుపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల భద్రతను అత్యున్నత ప్రాధాన్యతగా భావిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ముసాయిదా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్న ఈ కొత్త నిబంధనల ప్రకారం, కాలేజీలు మరియు స్కూళ్లలో ఎలాంటి సినిమా వేడుకలు, కమర్షియల్ ప్రమోషన్లకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడనుంది.

పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి చేయడంతో పాటు, అంచనా వేసిన హాజరు, స్టేజ్ ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరియు ఫైర్ సేఫ్టీ ప్రమాతలను కచ్చితంగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యా మందిరాలుగా ఉండాల్సిన క్యాంపస్‌లను కమర్షియల్ వ్యాపార వేదికలుగా మారుస్తున్న తీరుపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం అవ్వడం ఖాయం.

 

మీకు నచ్చవచ్చు: రామాయణ ఆస్కార్ కొడుతుందా!
మీకు నచ్చవచ్చు :తన అందంతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ హీరోయిన్!

 

[Telangana Colleges Movie Promotions Ban, telangana schools colleges, movie promotions ban, educational institutions, student safety,Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]
 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com