Home

»

Latest News

రెండు హిందీ ప్రాజెక్టుల‌కు సంత‌కం చేసిన తేజ‌

Apr 9, 2022 11:16AM

 

టాలీవుడ్ పాపుల‌ర్‌ డైరెక్టర్ తేజ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తెలుగులో ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాలు రూపొందించిన తేజ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు తేజ ఇప్పటికే రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. వీటిని టైమ్ ఫిల్మ్స్.. NH స్టూడియోస్,  ట్రిఫ్లిక్స్ ఫిలిమ్స్‌తో కలిసి నిర్మించనుంది.

తేజ సంత‌కం చేసిన రెండు ప్రాజెక్ట్‌లలో ఒకటి ‘జఖమి’. ఇద్దరు బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కశ్మీర్‌లోని మంచు ప్రాంతంలో జరగనుంది. మరో ప్రాజెక్ట్ 'తస్కరి' అనే వెబ్ సిరీస్‌. 1980 బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు సీజన్ల సిరీస్ గా, ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com