Home

»

Latest News

100 లవ్ లో రెండవ హీరోయిన్ గా తార అలీషా

Apr 28, 2011 12:43PM

100 లవ్ లో రెండవ హీరోయిన్ గా తార అలీషా నటిస్తుంది. వివరాల్లోకి వెళితే యువ హీరో నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తూండగా, సుకుమార్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై, బన్నీ వాసు నిర్మిస్తున్న తొలి చిత్రం "100% లవ్". "100% లవ్" చిత్రానికి దేవీ శ్రి ప్రసాద్ అందించిన సంగీతం విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూంది. "100% లవ్" చిత్రంలో రెండవ హీరోయిన్ గా తార అలీషా అనె కొత్తమ్మాయి నటిస్తూంది.

తార అలీషా కెనెడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూలు చదువు ముగించి, కాలిఫోర్నియాలోని చాప్ మెన్ యూనివర్సిటీలో చదువుతూ నటనలో శిక్షణ తీసుకుంటుండగా ఇండియాకు వచ్చింది. మహేష్ బాబుని పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన ప్రముఖ సంస్థ క్వాన్ తార అలీషాను కూడా గీతా ఆర్ట్స్ కు పరిచయం చేసింది. ఆ విధంగా "100% లవ్" చిత్రంలో తార అలీ షా రెండవ హీరోయిన్ గా ప్రవేశించింది. కానీ ఇప్పటికే హీరోయిన్లుగా వెలుగుతున్న కాజల్ అగర్వాల్, తాప్సి, ఇలియానా, త్రి, సమంత వంటి హీరోయిన్లకు ఎంత వరకూ పోటీ ఇచ్చి నిలబడగలదో కాలమే చెప్పాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com