.jpg)
తమన్నా టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం "అభినేత్రి". ఈ చిత్రంలో తమన్నా ద్విపాత్రాభినయం పోషిస్తోందని, వాటిలో ఒకటి కైపెక్కించే కథానాయిక పాత్ర కాగా.. రెండోది పల్లెటూరి పిల్ల పాత్ర. ఈ రెండు విభిన్నమైన పాత్రలతోపాటు దెయ్యంగా కూడా భయపెట్టనుందని టాక్. అయితే.. నిన్న ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుదేవా మాట్లాడుతూ "అభినేత్రి" సినిమా గురించి, ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ గురించి చాలా విషయాలు చెప్పేశాడు.
ఈ సినిమాలో తమన్నా ఓ మధ్యతరగతి యువతిగా కనిపించనుందట, చిన్నప్పట్నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉన్న ఒకమ్మాయి పెళ్లి చేసుకొని ఆ తర్వాత హీరోయిన్ ("అభినేత్రి")గా ఎలా మారింది. హీరోయిన్ అయ్యాక ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి అనేది సినిమా కథాంశం. ఈ కథకు హారర్ ఎలిమెంట్ ను జోడించారట. అయితే.. దెయ్యంగా కనిపించనుంది ఎవరు? అనేది మాత్రం సినిమా రిలీజ్ వరకూ సస్పెన్స్ అన్నమాట. తమన్నా భర్తగా ప్రభుదేవా నటిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్ ఓ ముఖ్యభూమిక పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రభుదేవా, తమన్నాల టీజర్లు విశేషంగా ఆకట్టుకొంటుండగా ఈనెలలో ఆడియో విడుదల చేసి సెప్టెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుకొంటున్నాడు నిర్మాత మరియు సమర్పకుడు అయిన కోన వెంకట్!





