Home

»

Latest News

సద్గురు కాళ్లకు తమన్నా నమస్కారం.. అక్కడ మిల్కీ బ్యూటీ చేసిన పని ఇదే!

Nov 23, 2026 1:13PM

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన ఆధ్యాత్మికతతో వార్తల్లో నిలిచారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె.. ఆధ్యాత్మిక గురువు సద్గురును కలుసుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

నవంబర్ 22న ముంబైలో సద్గురు రచించిన ఫోటో ఎస్సే పుస్తకం ‘డిసప్పియరింగ్ ఫేసెస్’ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తమన్నాతో పాటు దర్శకుడు విశాల్ భరద్వాజ్ కూడా హాజరయ్యారు. సద్గురు తన బృందంతో అక్కడికి చేరుకున్న సమయంలో తమన్నా ఆయన దగ్గరకు వెళ్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా కూడా కనిపించారు. పుస్తక ఆవిష్కరణలో భాగంగా ముందుగా ఫోటో గ్యాలరీని సందర్శించారు. అనంతరం సద్గురు, తమన్నా, విశాల్ భరద్వాజ్ మధ్య ప్రత్యేకంగా సంభాషణ కార్యక్రమం జరిగింది. చివరగా పుస్తకంపై సంతకాలు చేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

సద్గురు పాదాలకు తమన్నా నమస్కరించడం ఆమె ఆధ్యాత్మిక ఆసక్తిని తెలిసిన వారికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. గతంలోనూ ఆమె పలుమార్లు తన భక్తి భావాన్ని బయటపెట్టారు. కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు మహాశివరాత్రి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆమె ఉత్సాహంగా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: హిట్లు, ఫ్లాపులతో సాగిన ప్రయాణం.. నాగచైతన్య కెరీర్‌లో ఆసక్తికర విశేషాలివే.!

తమన్నా భక్తి భావం ఆమె సినిమాల్లోనూ కనిపించింది. తెలుగులో వచ్చిన ‘ఓదెల 2’ చిత్రంలో ఆమె శివుడి భక్తురాలి పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వ్యక్తిగత జీవితంలోనూ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తున్న తమన్నా.. మరోసారి సద్గురును కలుసుకుని ఆశీస్సులు తీసుకోవడంతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, తమన్నా ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ చిత్రంలో కనిపించారు. ఈ ఫాంటసీ థ్రిల్లర్ సెప్టెంబర్‌లో విడుదలైంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ది వ్వాన్ 2’ కూడా తెరకెక్కనుంది. దీంతో పాటు తమన్నా నటిస్తున్న తదుపరి ప్రాజెక్టులపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చవచ్చు: 

అల్లు సినిమాస్‌లో టికెట్లు బ్లాక్ చేస్తున్నారా? రంగంలోకి దిగిన అల్లు అరవింద్.!

సుకుమార్ శిష్యుడితో కిరణ్ అబ్బవరం.. ‘రికార్డ్’ మూవీ గ్రాండ్ లాంచ్.!

 

 

 

[TamannaahBhatia, Sadhguru, SadhguruMumbaiEvent, DisappearingFacesBook, Odela2] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com