60 ప్లస్ స్టార్స్ తో తమ్మూ రొమాన్స్.. బ్యాక్ టు బ్యాక్ కొట్టేస్తుందా!
on Jul 13, 2023
రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ - సిరీస్ కోసం శృంగార సన్నివేశాల్లో ఘాటుగా నటించి వార్తల్లో నిలిచింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. కట్ చేస్తే.. ఇప్పుడు మరోమారు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిందీ గ్లామర్ సెన్సేషన్. అయితే, ఈ సారి హాట్ సీన్స్ తో కాదు కానీ.. 60 ప్లస్ స్టార్స్ తో రొమాన్స్ చేసిన సినిమాలు వెంటవెంటనే రిలీజ్ అవుతుండడంతో మన మిల్కీ భామ వార్తల్లో వ్యక్తి అవుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడీగా తమన్నా నటించిన సినిమా 'జైలర్'. ఈ ఇద్దరి కలయికలో తొలిసారిగా వస్తున్న చిత్రమిది. ఇప్పటికే ''వా.. నువ్వు కావాలయ్యా'' అంటూ సాగే సాంగ్ లో ఓ సిగ్నేచర్ స్టెప్ తో సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది తమన్నా. కాగా, ఈ చిత్రం ఆగస్టు 10న జనం ముందుకు రాబోతోంది. మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవికి జంటగా 'సైరా.. నరసింహారెడ్డి' తరువాత తమన్నా నటించిన 'భోళా శంకర్' కూడా ఆగస్టు 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. అంటే.. రెండు వరుస రోజుల్లో 60 ప్లస్ స్టార్స్ తో మిల్కీ సుందరి రొమాన్స్ చేసిన సినిమాలు సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయన్నమాట. మరి.. ఈ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో తమన్నా బ్లాక్ బస్టర్స్ కొడుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఆరంభంలో శ్రుతి హాసన్ కూడా ఇలానే 60 ప్లస్ స్టార్స్ తో రెండు వరుస రోజుల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణకి జంటగా 'వీరసింహారెడ్డి'తో జనవరి 12న పలకరించిన శ్రుతి.. చిరంజీవి సరసన 'వాల్తేరు వీరయ్య'తో జనవరి 13న సందడి చేసింది. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సో.. శ్రుతి మ్యాజిక్ ని తమన్నా రిపీట్ చేస్తుందా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
