టబు.. స్పై థ్రిల్లర్ సిరీస్!
on Sep 17, 2021
ఐదు పదులకి చేరువవుతున్నా.. వన్నె తరగని అందంతో అలరిస్తోంది వెటరన్ యాక్ట్రస్ టబు. కథానాయిక వేషాల నుంచి క్యారెక్టర్ రోల్స్ కి టర్న్ అయినా.. తనదైన అభినయపటిమతో మెప్పిస్తోంది ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ. రీసెంట్ గా `అల వైకుంఠపురములో`తో టాలీవుడ్ లో రి-ఎంట్రీ ఇచ్చిన టబు.. హిందీనాట మాత్రం ఇప్పటికీ వరుస సినిమాలతో జోరు చూపిస్తూనే ఉంది. `అంధాధున్`, `దే దే ప్యార్ దే` చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి మెస్మరైజ్ చేసిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. త్వరలో `భూల్ భులయ్యా 2` అనే బాలీవుడ్ మూవీతో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. గత ఏడాది `ఏ సూటబుల్ బోయ్` అనే టీవీ సిరీస్ తో ఎంటర్టైన్ చేసిన టబు.. త్వరలో మరో సిరీస్ లో భాగం కానుంది. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ డైరెక్షన్ లో దిగ్గజ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ఓ స్పై థ్రిల్లర్ ని నిర్మించనుంది. అమర్ భూషణ్ రచించిన `ఎస్కేప్ టూ నో వేర్` అనే నవల ఆధారంగా రూపొందనున్న ఈ సిరీస్ కి `ఖుషియా` అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. నెలాఖరు నుంచి పట్టాలెక్కనున్న ఈ సిరీస్.. సింహభాగం న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుపుకోనుందని సమాచారం. మరి.. ఈ సిరీస్ తో టబుకి నటిగా ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.