రెండో ఆటకే సూర్య సినిమాను కత్తిరించేశారట..!
on May 7, 2016
సూర్య 24 సినిమా విడుదలైన ప్రతీచోట సూపర్ హిట్ అనే పేరు తెచ్చుకుంది. సక్సెస్ ఫుల్ సినిమాగా సూర్యకు మంచి కిక్ ఇచ్చింది 24 మూవీ. రివ్యూలన్నీ అద్బుతమైన సినిమా అని చెబుతూనే, సెకండాఫ్ లో ప్రేమ సన్నివేశాలు కాస్త చికాకు తెప్పిస్తాయని రాశారు. ఇమేజినో రొమాన్సో ఫీలియా లాంటి సీన్లన్నీ కాస్త కథాగమనపు వేగాన్ని తగ్గించేశాయని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఒక పాట, బొత్తిగా ప్లేస్ మెంట్ లేదు అని అందరూ అంటున్న మాటలు సూర్య అండ్ కో వరకూ వెళ్లాయి. మామూలుగా అయితే రిలీజై హిట్ టాక్ తెచ్చేసుకుంది ఇంక ఫర్లేదులే అని వదిలేస్తారు చాలా మంది.
కానీ మొదటి నుంచీ సినిమాను చాలా ఇష్టంగా అందర్నీ ఎంటర్ టైన్ చేయడానికే తప్ప డబ్బు గురించి ఆలోచించలేదని చెబుతూ వస్తున్న సూర్య, విక్రమ్ లు రివ్యూలను సీరియస్ గా తీసుకున్నారు. కేవలం మొదటి ఆట అయ్యే టైం విషయం తెలుసుకుని, వెంటనే ఎడిటింగ్ చేయించి, సెకండాఫ్ ను కూడా వీలైనంత క్రిస్ప్ గా మార్పించారట. దాదాపు 9 నిముషాల నిడివిని పూర్తిగా కట్ చేసేశారట. సైఫై జానర్లోని సినిమాలు పెర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తే, పాటలు రొమాన్స్ లు లేకపోయినా జనాలకు నచ్చేస్తుంది. ఏదేమైనా మళ్లీ శ్రమ తీసుకుని ఎడిటింగ్ చేసి, సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేసిన సూర్య, విక్రమ్ కే కుమార్ ను మెచ్చుకోవాల్సిందే.