Home

»

Latest News

సూర్య 'ఈటి' ట్రైల‌ర్ చెప్తోన్న ఇంట్రెస్టింగ్ విష‌యాలు!

Mar 2, 2022 3:09PM

 

సూర్య హీరోగా న‌టించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఈటి'.  పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10న ఒకేసారి విడుదల కానుంది.

ఇటీవలే హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ET టీజర్‌ను రిలీజ్ చేయ‌గా, నేడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు పంపారు. "ఈటి తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా వుంది. రాక్ సాలిడ్‌గా లుక్ కనిపిస్తోంది. నాకు ఇష్టమైన హీరో సూర్యకు `ఎవరికి తలవంచడు`చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని విజయ్ పోస్ట్ చేశాడు.

ఈ మూవీలో ఇతరుల ఆనందంలో ఆనందాన్ని చూడాలనుకునే సామాజిక పోరాట యోధుడిగా సూర్య నటించారు. అతని గాళ్ ఫ్రెండ్ గా ప్రియాంక అరుల్ మోహన్  బబ్లీగా ఉండే పాత్ర పోషించింది. ఒక నేర‌గాడి ముఠా అంద‌రూ క‌లివిడిగా ఉండే ఓ గ్రామంలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడంతో అక్క‌డి సామరస్యం దెబ్బతింటుంది. అక్క‌డి సామరస్యాన్ని తిరిగి తీసుకురావడానికి కథానాయకుడు ఎలాంటి ప‌ని చేశాడ‌నేది ప్ర‌ధానాంశం.

సూర్య ఇంటెన్సివ్, పవర్-ప్యాక్డ్ రోల్‌ను పోషించాడు. ఆయ‌న కొన్ని సమయాల్లో ఫన్నీగా ఉంటాడు. అలాగే ప్రజలను రక్షించే విషయంలో దూకుడుగా ఉంటాడని ట్రైల‌ర్ తెలియ‌జేస్తోంది. ప్రియాంక అరుల్ మోహన్ చాలా అందంగా కనిపించగా వినయ్ రాయ్ ప‌వ‌ర్‌ఫుల్‌ విలన్‌గా నటించాడు.

పాండిరాజ్ తన రచన, దర్శకత్వం కోసం ఒక‌ బర్నింగ్ ఇష్యూను ఎంచుకున్నాడు. డి ఇమ్మాన్ అందించిన నేపథ్య సంగీతం అన్ని అంశాలను ఎలివేషన్లను చేస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ లో ఆకట్టుకుంటుంది. సత్యరాజ్, రాజ్ కిరణ్, శరణ్య పొన్‌వ‌ణ్ణన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com