Home

»

Latest News

సూర్య కంబ్యాక్ అదిరింది.. ఇక విక్రమ్ వంతు.. కరెక్ట్ సినిమా పడితే వసూళ్ల జాతరే!

May 18, 2026

కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' (karuppu) బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తోందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రికార్డు స్థాయి వసూళ్లతో సూర్య తన ఒకప్పటి బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. గత కొన్నేళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ వర్సటైల్ యాక్టర్, ఈ చిత్రంతో ఊహించని రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చారు. 

థియేటర్లలో సూర్య మాస్ యాక్షన్, గాడ్ మోడ్ పర్ఫార్మెన్స్ చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.120 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఒక స్టార్ హీరోకి సరైన కమర్షియల్ బొమ్మ పడితే థియేటర్ల వద్ద వసూళ్ల జాతర ఎలా ఉంటుందో సూర్య క్లియర్ గా చూపించారు.

సూర్య తన బాక్సాఫీస్ పవర్ ఏంటో చూపించడంతో ఇప్పుడు అందరి దృష్టి మరో వెర్సటైల్ కోలీవుడ్ హీరో విక్రమ్ (Vikram) వైపు మళ్లింది. వైవిధ్యమైన పాత్రలకు, అద్భుతమైన నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన విక్రమ్ కూడా ఒక భారీ కంబ్యాక్ కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ మార్కెట్‌ను చాలా కాలం క్రితమే క్రేజీ హిట్లతో కొల్లగొట్టిన రికార్డు విక్రమ్ సొంతం. తెలుగు ప్రేక్షకులకు విక్రమ్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. 'అపరిచితుడు' సినిమాతో ఆయన సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటికీ తెలుగు సినీ ప్రియుల గుండెల్లో బలంగా నాటుకుపోయింది. 

తమిళనాడు బాక్సాఫీస్ వద్ద కూడా ఎన్నో స్ట్రాంగ్ కమర్షియల్ హిట్లు, ఇండస్ట్రీ రికార్డులు సాధించిన ఘనత ఆయనకు ఉంది. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే కాకుండా, సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మాస్ స్టోరీ విక్రమ్ కి పడితే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి.

సినిమా కోసం ఎంతో కష్టపడే విక్రమ్ లాంటి నటుడికి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ పడాలే కానీ, వసూళ్ల సునామీ సృష్టించడం పెద్ద విషయమేమీ కాదు. ఆయన రెగ్యులర్ సినిమాల కలెక్షన్లతో పోలిస్తే, ఒక రైట్ స్క్రిప్ట్ పడిన రోజున వచ్చే బాక్సాఫీస్ గ్రోత్ ఊహకందని రేంజ్ లో ఉంటుంది. 

సూర్య 'కరుప్పు' సినిమాతో క్రియేట్ చేసిన మాస్ డిస్ట్రక్షన్ లాగే, విక్రమ్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో ఇండస్ట్రీని షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో విక్రమ్ ఎలాంటి కంబ్యాక్ తో థియేటర్లను షేక్ చేస్తారో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com