Home

»

Latest News

సూర్య,మణిరత్నం సంచలన కాంబో: 8 ఏళ్ల నాటి కథతో మళ్లీ రాబోతున్నారా?

Sep 22, 2026 12:55PM


సూర్య వరుస హిట్స్ తో జోరు మీద ఉన్నాడు.  మరి ఆ జోరుకి భారతీయ సినీ పరిశ్రమ గర్వంగా చెప్పుకునే దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబో కలిస్తే అభిమానులతో పాటు సోషల్ మీడియా సైతం ఎగిరి గంతేస్తుంది. నిజానికి సూర్య సినీ ప్రస్థానం మణిరత్నం నిర్మించిన 'నేరుక్కు నేర్' (1997) చిత్రంతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే  'యువ' చిత్రంలో మైఖేల్ అనే శక్తివంతమైన క్యారక్టర్ లో సూర్య కనబరిచిన నటన ఆయన కెరీర్‌కే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

ఇక ఈ సంచలన కలయిక వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. దాదాపు 8 ఏళ్ల క్రితమే మణిరత్నం, సూర్యకు ఒక అద్భుతమైన లైన్ వినిపించారట. అయితే ఆ సమయంలో వేర్వేరు ప్రాజెక్టుల వల్ల, ఇతర కారణాల చేత ఆ చిత్రం పట్టాలెక్కలేకపోయింది. కానీ ఇప్పుడు అదే కథను మణిరత్నం నేటి ట్రెండ్‌కి తగినట్లుగా కీలకమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈ మోడిఫైడ్ వర్షన్ స్క్రిప్ట్‌ని  సూర్యకు మళ్లీ నరేట్ చేయడానికి మణిరత్నం సిద్ధమవుతున్నారు. కొత్త కథనం గనక సూర్యకు నచ్చితే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారై, ఆయన లైనప్‌లోకి చేరుతుంది.

ఇది కుడా చదవండి: చిరంజీవి భావోద్వేగ ట్వీట్: 48 ఏళ్ల క్రితం మారిన జీవితం!

 

ప్రస్తుతం దర్శకుడు మణిరత్నం విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా 'ఇంజి వెల్లమ్' అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొల్కతా నేపథ్యంలో సాగే ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తయిన వెంటనే, ఆయన సూర్య కాంబినేషన్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హీరో సూర్య కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'సీన్' చిత్రం నవంబర్ 6న విడుదల కానుండగా, ఆ తర్వాత జై భీమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో డాక్టర్ పాత్రలో నటిస్తున్న సినిమాతో పాటు మరో 3 సినిమాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి. ఇద్దరూ తమ వద్ద ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి చిత్ర పరిశ్రమలో ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు మణిరత్నం మూవీ జరుగుతుందేమో చూద్దాం.

 
[Suriya, Mani Ratnam,  Suriya Mani Ratnam movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com