Home

»

Latest News

సూర్య ఏళాం అరివు లో హాలీవుడ్ విలన్

Apr 20, 2011 9:43AM

surya wallpapers, surya stills, surya pics, surya images, surya photos, surya picturesసూర్య హీరోగా నటిస్తున్న "ఏళాం అరివు" చిత్రంలో హాలీవుడ్ విలన్ నటిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మురుగదాసన్ దర్శకత్వంలో, "గజిని" ఫేం సూర్య హీరోగా, కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ హీరోయిన్ గా, ఉదయనిధి మారన్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "ఏళాం అరివు".

 

ఈ చిత్రం కోసం హాలీవుడ్ విలన్ ని తమిళ తెరకు పరిచయం చేస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఈ విలన్ పేరు "జాన్ టి గూయాన్". ఇతను హాలీవుడ్ లో "స్పైడర్ మ్యాన్ -2", "క్రాడల్ ది గ్రేవ్" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇతను మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్ పర్ట్ అని సమాచారం.

 

ఈ "ఏళాం అరివు" చిత్రానికి హేరీస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒక పాటను వెయ్యి మంది డ్యాన్సర్లతో చెన్నైలో బిజీగా ఉండే రామనాధం తెరువు (వీధి) లో చిత్రీకరించారు. మామూలుగా మురుగదాస్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఆ సినిమాలో కచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో "గజిని" చిత్రం తీసిన తర్వాత తను తీస్తున్న ఈ "ఏళాం అరివు" చిత్రం మరింత విభిన్నంగా ఉండేలా మురుగదాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 

ఈ చిత్రం కోసం హీరో సూర్య కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుండి తన గెటప్, డైలాగ్ మాడ్యులేషన్ వరకూ ఈ "ఏళాం అరివు" చిత్రం కోసం సూర్య చాలా మార్పులు చేర్పులు చేస్తున్నాడట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com