పిచ్చెక్కిస్తున్న సురేఖ..
on Sep 21, 2016
బుల్లితెరపై యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకుని ఆ క్రేజ్‌తో వెండితెరపై ఛాన్సులు కొట్టేసింది సురేఖవాణి. ఇప్పుడైతే కాస్త జోరు తగ్గింది కాని అప్పట్లో అక్క, వదిన, అమ్మ పాత్రలన్ని ఈవిడవే. అలా ఫ్యామిలీ ఆడియాన్స్లో మంచి ఇమేజ్ సంపాదించుకుంది ఈ బెజవాడ బ్యూటీ. అయితే రీసెంట్గా ఛాన్సులు అంతగా రాకపోవడంతో ఖాళీగా ఉంటూ పిల్లల బాధ్యత చూసుకుంటోంది. అయితే నిన్న తెలుగు మీడియా మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది సురేఖ. తన టీనేజ్ కూతురితో కలిసి సురేఖ వాణి షూట్ చేసుకున్న ఒక వీడియో సంచలనం సృష్టించింది. తన కూతురితో పాటు చిన్న షార్ట్ వేసుకుని బార్ బార్ దేఖో మూవీలోని కాలా చష్మా పాటకి డ్యాన్స్ ఇరగదీసింది. తన కూతురికంటే కూడా సురేఖే బాగా మూమెంట్లు చేసింది. ఇది చూసిన జనాలు ఈవిడలో ఈ కోణం కూడా ఉందా..? అంటూ షాకవుతున్నారు.