
భారతీయ సంగీత ప్రపంచంలో 'ఇసైజ్ఞాని'గా నీరాజనాలు అందుకుంటున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన స్వరపరిచిన ఆల్‌టైమ్ క్లాసిక్ సాంగ్ 'ఎన్ ఇనియ పొన్ నిలవే' పాట కాపీరైట్ వివాదంలో.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము ఏమాత్రం జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ కేస్ వివరాల్లోకి వెళ్తే... 1980ల కాలంలో వచ్చిన 'మూడు పాని' చిత్రంలోని ప్రఖ్యాత గీతం 'ఎన్ ఇనియ పొన్ నిలవే'. కాగా ఇటీవల 'అఘతియా' అనే చిత్రంలో ఈ పాటను రీక్రియేటెడ్ వెర్షన్ గా లైసెన్స్ ఇచ్చే విషయంలో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే ప్రముఖ మ్యూజిక్ సంస్థ 'సరిగమ' తమకు ఆ పాట సౌండ్ రికార్డింగ్ పై పూర్తి హక్కులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఇళయరాజా ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు.

తాజాగా జస్టిస్ జె. బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక సినిమా పాటలో ఇళయరాజా కేవలం ఆ పాట యొక్క సంగీతాని(ట్యూన్)కి మాత్రమే హక్కుదారుడు. అంతే తప్ప, లిరిక్స్, పూర్తి సౌండ్ రికార్డింగ్, దాన్ని ఇతరులకు రీక్రియేట్ చేయడానికి లైసెన్స్ ఇచ్చే సర్వాధికారాలు ఆయనకు ఉండవని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో పాటల కాపీరైట్స్ వివాదంలో ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ 'సరిగమ'కు విక్టరీ లభించినట్లైంది.
ఇది కూడా చదవండి: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. సుడిగాలి సుధీర్ 'GOAT'కు మోక్షం.!
[Ilaiyaraaja Copyright Case, Supreme Court Sensational Verdict, Ilaiyaraaja Supreme Court, En Iniya Pon Nilave, Saregama Vs Ilaiyaraaja, Ilaiyaraaja Songs, Ilaiyaraaja Case, Telugu Film News]






