మే 6న రిలీజ్ అవుతున్న బ్రహ్మోత్సవం..?
on Apr 13, 2016
టాలీవుడ్‌ను ఏలుతున్న ఇద్దరు స్టార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్లలోకి రావడంతో నెక్స్ట్ అందరి ఫోకస్ మహేశ్‌పై పడింది. శ్రీకాంత్ అడ్డాల కాంభినేషన్లో ప్రిన్స్ నటిస్తున్న బ్రహ్మోత్సవం షూటింగ్ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. ఎలాగైనా మేలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు టార్గెట్‌గా పెట్టుకున్నారంట.
ఈ మధ్య కొన్ని రోజులు వారణాసిలో షూటింగ్ చేసుకొచ్చిన బ్రహ్మోత్సవం యూనిట్ ప్రజంట్ రామోజీ ఫిలింసిటీలో చివరి షెడ్యూల్‌ను షూటింగ్ చేస్తోంది. ఈ నెల 10 కల్లా ఫిలింసిటీలో షూటింగ్ కంప్లీట్ చేసి, బ్యాలెన్స్ రెండు పాటలను పూణెలో షూట్ చేయాలని ప్లాన్ చేశారు. ఒకే టైంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి, సెన్సార్‌కు రెడీ చేస్తున్నారు. ఏప్రిల్ 24న ఆడియో వేడుకని నిర్వహించి, మే 6న సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని, కలెక్షన్స్ కూడా బాగా వస్తాయని ఆ సినిమా యూనిట్ భావిస్తున్నట్టు ఫిలింనగర్ టాక్.