సూర్య కోసం 250 కోట్లు..
on Jun 5, 2016
దర్శకుల స్టామినాను బట్టి బడ్జెట్లు పెరిగిపోతున్న రోజుల్లో..హీరోల కోసం కూడా ఎంత బడ్జెట్ కావాలంటే అంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. అలాంటి హీరోల్లో ఒకరు సూర్య. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగలనని ఎన్నోసార్లు నిరూపించుకున్న సూర్య అనేక ప్రయోగాలతో సక్సెస్ అందుకున్నారు. లేటేస్ట్‌గా కాలంలో ప్రయాణించడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 24 సినిమాలో త్రిపాత్రాభినయంలో నటించి సూర్య తెలుగు, తమిళ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతో పాటు భారీ వసూళ్లను రాబట్టాడు. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు సుందరస్ సి డైరెక్షన్లో భారీ పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు సూర్య. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. మొత్తం 250 కోట్ల బడ్జెట్‌తో "శ్రీ తెనండల్ ఫిలింస్" ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చింది. సూర్యపై నమ్మకంతోనే ఈ సంస్థ అంత సాహసం చేస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.