Home

»

Latest News

Sundeep Kishan: సందీప్ కిషన్ బర్త్‌డేకు ‘శంబాల’ డైరెక్టర్ స్పెషల్ గిఫ్ట్!

May 07, 2026

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, సందీప్ కిషన్‌(Sundeep Kishan)తో ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ నటిస్తున్న 23వ చిత్రమిది (SK33). ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అడివికి రాజైన సింహం, తోడేలు మధ్య జరిగే పోటీలా ఈ సినిమాలో అడ్వంచర్స్ ఉంటాయని టీం హింట్ ఇచ్చింది. 

ఇక ఇప్పుడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లోని ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఇవన్నీ చూస్తుంటే ఇదొక ఫారెస్ట్ అడ్వంచర్ చిత్రం అని అర్థం అవుతోంది. ఇక ఇందులో సింహంలాంటి యోధుడిగా సందీప్ కిషన్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఏ లెజెండ్ ఈజ్ బార్న్ అంటూ వదిలిన ఈ పోస్టర్ ఆడియెన్స్‌లో ఒక్కసారిగా అంచాల్ని రెట్టింపు చేసింది. ఈ ఫాంటసీ అడ్వంచర్‌ను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించారు. మరి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com