Home

»

Latest News

'మహేంద్రగిరి వారాహి' రిలీజ్ డేట్ ఫిక్స్.. డివైన్ పవర్‌తో సుమంత్ హిట్ కొడతాడా.?

Jul 27, 2026 2:40PM

టాలెంటెడ్ యాక్టర్ సుమంత్ హీరోగా రూపొందుతున్న భారీ ఆధ్యాత్మిక అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ 'మహేంద్రగిరి వారాహి' రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. డివైన్ కాన్సెప్ట్, పురాణాల నేపథ్యంతో మిస్టరీ మిళితమైన కథలను ఇష్టపడే సినీ ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప విజువల్ ట్రీట్‌లా ఉండబోతోందని పోస్టర్ లుక్ స్పష్టం చేస్తోంది.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజా శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోంది. అనూప్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం, ప్రతాప్ ఆర్ కృష్ణ కెమెరా పనితనం ఈ విజువల్ వండర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

మహేంద్రగిరి పర్వత శ్రేణులు, వారాహి అమ్మవారి దివ్య శక్తి, కొన్ని నిగూఢమైన రహస్యాల చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరుగుతుంది. సుమంత్ కెరీర్‌లోనే ఎంతో భిన్నమైన, డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. సెప్టెంబర్ 11న బాక్సాఫీస్ వద్ద ఈ డివైన్ థ్రిల్లర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

 

 

Sumanth, Mahendragiri Varahi, Release Date

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com