Home

»

Latest News

ఏఎన్నార్ చూసిన చివరి చిత్రం ఏదో తెలుసా..?

Nov 1, 2016 12:14PM

ఏడు దశాబ్ధాల పాటు తన నటనతో అలరించి నటసామ్రాట్ గా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అక్కినేని నాగేశ్వరరావు. తన ప్రస్థానంలో ఎన్నో సినిమాల్లో నటించి, ప్రేక్షకుడిగా చాలా సినిమాలను ఆయన వీక్షించి ఉంటారు. క్యాన్సర్ తో బాధపడుతూ తన చివరి రోజుల్లో ఆయన చాలా సినిమాలను వీక్షించారు. వాటిలో ఏఎన్నార్ ఒక సినిమాను చూసి మెచ్చుకోవడమే కాకుండా అలాంటి సినిమాలు తెలుగులో కూడా రావాలని ఆకాంక్షించారట.

ఆ సినిమా మరేదో కాదు సూర్జీత్ సర్కార్ దర్శకత్వంలో ఆయూష్మన్ ఖురానా, యామీ గౌతమ్ నటించిన సూపర్ హిట్ మూవీ వఇక్కిడోనర్". ఈ విషయాన్ని ఆయన మనవడు, హీరో సుమంత్ తెలిపారు. ఆయన హీరోగా నటించిన నరుడా డోనరుడా సినిమాకు సంబంధించిన విశేషాలను సుమంత్ మీడియాతో పంచుకున్నారు. తాతగారు చివరి రోజుల్లో విక్కీడోనర్ చిత్రాన్ని చూశారు. ఇలాంటి కొత్త సబ్జెక్ట్ తెలుగులో తీస్తే బాగుంటుందని ఆయనే సలహా ఇచ్చారు. అప్పటి నుంచి నా దగ్గరకు వచ్చే నిర్మాతలందరికీ ఇదే విషయాన్ని చెబుతూ వచ్చా. అలా మల్లిక్ రామ్ చాలా తక్కువ బడ్జెట్ లోనే తెలుగు నేటివిటికి తగ్గట్టు చాలా బాగా తీశారు అన్నారు సుమంత్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com