స్టేజ్ మీదే సుమను పెళ్ళి చేసుకుంటానన్నాడు..!
on Dec 22, 2016
చలాకితనం..చిలిపితనంతో కూడిన యాంకరింగ్‌తో బుల్లితెర మహారాణిగా వెలుగొందుతున్నారు స్టార్ యాంకర్ సుమా కనకాల. బుల్లితెర అయినా స్టేజ్ షోలైనా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ సుమానే. ఒకవేళ ఆమెకు అడ్జెస్ట్కాకపోతే వేరొకరికి ఆ ఛాన్స్ వెళుతుంది తప్ప లేదంటే నో ఛాన్స్. టాలీవుడ్లో మేజర్ ఆడియో ఫంక్షన్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అందరిపై పంచ్‌లు వేస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంటారు సుమ. అలాంటి సుమకే రివర్స్‌లో పంచ్‌లు వేశాడు ఓ యంగ్ హీరో.
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన శతమానం భవతి ఆడియో వేడుకకు యంగ్ హీరో రాజ్ తరుణ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతున్న రాజ్‌తరుణ్‌ని సుమ ఓ చిలిపి ప్రశ్న వేసింది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని..దీనికి రాజ్‌తరుణ్ ఇచ్చిన సమాధానం విని సుమతో సహా అందరూ షాక్ అయ్యారు. మీకింకా పెళ్లి కాకపోయి ఉంటే తప్పకుండా నేనే పెళ్లి చేసుకునే వాడ్ని అంటూ సుమకు షాకిచ్చాడు. ఇంకేముంది ఆడిటోరియం మొత్తం నవ్వులే నవ్వులు.