Home

»

Latest News

25 ఏళ్ల ప్రస్థానం: రాజమౌళికే కాదు.. సుమకి కూడా స్పెషలే.!

Sep 30, 2026 12:56PM

25 ఏళ్ల క్రితం ‘స్టూడెంట్ నెం.1’ సినిమా వచ్చింది. ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు, ఎస్.ఎస్. రాజమౌళి గ్లోబల్ లెవెల్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అదే సినిమాతో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ లో యాంకర్ గా తన కెరీర్‌‌ను ప్రారంభించిన ఒక మలయాళీ అమ్మాయి, ఇప్పుడు తెలుగువారి ఇంట ఓ కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు.. స్టార్ యాంకర్, టెలివిజన్ క్వీన్ సుమ కనకాల.

తాజాగా జరిగిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సినిమాకు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాత కావడం విశేషం. ఈ ఈవెంట్ లో సుమను రాజమౌళి ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా, ఆమె కోసం స్పెషల్ AV కోసం ప్లే చేశారు. ఈ సందర్భంగా సుమ కాస్త ఎమోషనల్ అవుతూ తన జర్నీని గుర్తుచేసుకున్నారు. ‘స్టూడెంట్ నెం.1’తో రాజమౌళి గారితో పాటు, తాను కూడా హోస్ట్ గా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "నేను మైండ్ లోకి తెచ్చుకునే తొలి జ్ఞాపకం 'స్టూడెంట్ నంబర్ 1'. ఆ సినిమాతో ఎన్టీఆర్, రాజమౌళి వెనక్కి తిరిగి చూడలేదు, నేను కూడా ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూడలేదు" అన్నారు.

సుమ అన్న మాట నిజమే. సినిమా ఈవెంట్లు, ప్రమోషన్ స్ట్రాటజీలు మారుతూ వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో ఎంతమంది వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా.. ‘యాంకర్ అంటే సుమ.. సుమ ఉంటేనే ఆ ఈవెంట్ సూపర్‌హిట్’ అనే బ్రాండ్ ఇమేజ్ మాత్రం అస్సలు మారలేదు.

తెలుగు సరిగ్గా రాని ఒక మలయాళీ కుటుంబం నుంచి వచ్చి, తన అనర్గళమైన తెలుగు భాషా పటిమతో, సమయస్ఫూర్తితో, పంచ్‌లతో, ఎనర్జీతో కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. చిన్న సినిమాల ఆడియో లాంచ్ అయినా, 1000 కోట్ల భారీ సినిమా ఈవెంట్ అయినా.. వేదికపై సుమ ఉంటే అక్కడ పండే ఎంటర్‌టైన్‌మెంట్ వేరే లెవెల్.

పాతికేళ్లుగా ఏమాత్రం చెక్కుచెదరని ఆ ఎనర్జీ, సొంత గుర్తింపును నిలబెట్టుకున్న ఆ డెడికేషన్ నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

ఇది కూడా చదవండి: మెగా హీరో ఏమైపోయాడు.. త్వరలోనే అభిమానులకు ఆ న్యూస్ చెబుతాడా.?

 

 

 

[Suma Kanakala 25 Years Journey, Don't Trouble The Trouble, Student No 1 Movie 25 Years, Anchor Suma 25 Years, Suma Kanakala, Student No 1, Jr NTR, SS Rajamouli, Telugu Film News, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com