Home

»

Latest News

Pushpa 2: నేషనల్ అవార్డ్స్‌లో మళ్ళీ పుష్ప 2 సంచలనం.. సుకుమార్‌కి అభినందనల వెల్లువ

Jul 18, 2026 7:19PM

 

'తగ్గేదెలే' అనే రీతిలో కాసేపటి క్రితం ప్రకటించిన  72వ నేషనల్ అవార్డ్స్ లో పుష్ప 2  తన సత్తా చాటింది.  పుష్ప: ది రైజ్' మొదటి భాగానికి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గతంలోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించగా, ఇప్పుడు రెండో భాగానికి దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. 


ఒక కమర్షియల్ మాస్ యాక్షన్ డ్రామాకి జాతీయ స్థాయిలో కథనం యొక్క  నైపుణ్యం గుర్తించబడటం తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. కేవలం స్క్రీన్‌ప్లే మాత్రమే కాకుండా, 'పుష్ప 2' చిత్రానికి గాను దీపాలీ నూర్ మరియు శీతల్ శర్మలకి  ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా కూడా జాతీయ అవార్డు లభించింది.దీంతో  ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖాతాలో మొత్తం రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు చేరినట్లయింది. సుకుమార్ ప్రతిభను జాతీయ వేదికపై గుర్తించడంతో తెలుగు ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒక సాధారణ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ కథను అంతర్జాతీయ స్థాయి ఎమోషన్స్ మరియు మైండ్ గేమ్స్‌తో నడిపించిన సుకుమార్ రైటింగ్ స్టైల్‌కి  ఈ అవార్డు నిజమైన గుర్తింపు అని ఇండస్ట్రీ వర్గాలు కొనిాడుతున్నాయి.

ఈ అవార్డుల వేడుకలో తెలుగు సినిమా సాధించిన విజయాలు ఇక్కడితో ఆగిపోలేదు. పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డులు సృష్టించిన విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్తమ వినోదాత్మక చిత్రంగా (Best Popular Film Providing Wholesome Entertainment) నిలిచింది. అంతేకాకుండా నితిన్ జిహానీ చౌదరి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఈ చిత్రానికి గాను అవార్డు గెలుచుకున్నారు. మరోవైపు యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్' సినిమాకి బెస్ట్ స్క్రీన్‌ప్లే డైలాగ్స్ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. చిన్న చిత్రంగా వచ్చి థియేటర్లలో సంచలనం సృష్టించిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం బెస్ట్ తెలుగు రీజినల్ ఫిల్మ్‌గా  ఎంపికవడమే కాకుండా, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ పి. రవికుమార్ విభాగంలోనూ అవార్డును కొల్లగొట్టింది. మొత్తం మీద 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఉత్సవంలో తెలుగు సినిమా కమర్షియల్ వాల్యూస్‌తో పాటు కంటెంట్ పరంగా కూడా తానేంటో నిరూపించుకుంది, అందులో సుకుమార్ సాధించిన స్క్రీన్‌ప్లే అవార్డు టాలీవుడ్ రచనా నైపుణ్యానికి దక్కిన మకుటంగా నిలిచిపోతుంది

Also read: నేషనల్ అవార్డ్స్ లో కమిటీ కుర్రోళ్లు సంచలనం.. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మరిన్ని..

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా ఈ అవార్డుల విజేతల జాబితాను వెల్లడించింది. ప్రఖ్యాత మలయాళ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల సెంట్రల్ జ్యూరీ దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది ఎంట్రీలను నిశితంగా పరిశీలించి ఈ అవార్డులను ఖరారు చేసింది. ఈ ఏడాది అవార్డులలో తెలుగు సినిమా తన సత్తాను చాటుతూ ఏకంగా 7 ప్రధాన అవార్డులను సొంతం చేసుకుని గర్వంగా నిలిచింది. ఈ మహా విజయంలో టాలీవుడ్ లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సరికొత్త చరిత్ర లిఖించారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వేట సాగించిన ఐకానిక్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2: The Rule) చిత్రానికి గాను ఆయన ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (Best Original Screenplay) కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకున్నారు. సుకుమార్ రాసుకున్న గ్రిప్పింగ్ నరేషన్, అద్భుతమైన క్యారెక్టరైజేషన్లు, మాస్ ఎలిమెంట్స్ జ్యూరీ సభ్యులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

sukumar, allu arjun, pushpa 2

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com