Home

»

Latest News

మ‌హేశ్ చిన్న‌ప్ప‌టి రోల్‌లో మేన‌ల్లుడు!

Feb 10, 2022 4:05PM

 

మ‌హేశ్‌బాబు హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'స‌ర్కారువారి పాట' కోసం ఫ్యాన్స్ అత్యంత కుతూహ‌లంగా ఎదురుచూస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీని మే 12న రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించారు. ప‌ర‌శురామ్ పేట్ల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

ఈ మూవీలో మ‌హేశ్ క్యారెక్ట‌ర్ చిన్న‌ప్ప‌టి సీన్లు కూడా ఉంటాయ‌నీ, ఆ క్యారెక్ట‌ర్‌ను మ‌హేశ్ మేన‌ల్లుడు ద‌ర్శ‌న్ చేశాడ‌నీ వెల్ల‌డైంది. అత‌ను మ‌హేశ్‌ చిన్న‌బావ సుధీర్‌బాబు చిన్న‌కొడుకు. ఈ విష‌యాన్ని సుధీర్‌బాబు స్వ‌యంగా తెలియ‌జేశాడు. ద‌ర్శ‌న్‌కు 'స‌ర్కారువారి పాట' తొలి సినిమా కాదు. ఇదివ‌ర‌కే అత‌ను అడివి శేష్ సినిమా 'గూఢ‌చారి' (2018)లో న‌టించాడు.

సుధీర్ పెద్ద‌కొడుకు చరిత్ మాస‌న్‌ సైతం బాల‌న‌టుడిగా ఇదివ‌ర‌కే ప‌రిచ‌య‌మ‌య్యాడు. సుధీర్ న‌టించిన 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' (2015) మూవీలోనూ, సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా 'విన్న‌ర్‌'లోనూ అత‌ను న‌టించాడు.

'స‌ర్కారువారి పాట' షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. త‌మ‌న్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రంలోని ఫ‌స్ట్ సింగిల్ 'క‌ళావ‌తి'ని ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేయ‌నున్నారు. దీనికి సంబంధించి నిన్న‌ రిలీజ్ చేసిన మ‌హేశ్‌-కీర్తి పోస్ట‌ర్ వైర‌ల్ అయ్యింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com