Home

»

Latest News

"కబాలి"లో స్పెషల్ గెస్ట్ ఎవరు ??

Jul 21, 2016 10:59AM

ప్రపంచ వ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సినిమా అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "కబాలి". వరుసగా మూడు పరాజయాల తర్వాత రజనీకాంత్ పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రేపు విడుదల కానుండగా.. నిన్న అమెరికాలోని వర్గీనియాలో రజనీకాంత్ సమక్షంలో ఓ ప్రివ్యూ షో వేశారు. అక్కడే ఓ వ్యక్తి రజనీకాంత్ ఎంట్రీ సీన్ ను వీడియో తీసి అందరికీ వాట్సాప్ లో పంపాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. 

ఇకపోతే.. ఈ సినిమాలో రజనీకాంత్, రాధిక ఆప్టే, ధన్సిక వంటి స్టార్లు మాత్రమే కాక మరో స్పెషల్ గెస్ట్ రోల్ ఉందట. సదరు స్పెషల్ రోల్ లో ఓ ప్రముఖ నటుడు/నటీమణి కనిపించనుందని టాక్. ఆ నటుడు/నటీమణి ఎవరో తెలియదు కానీ.. ఆ పర్టీక్యులర్ సీన్ కి మాత్రం ధియేటర్ లో విజిల్స్ వీరాలెవల్లో మ్రోగుతాయని సమాచారం. మరి ఆ గెస్ట్ క్యారెక్టర్ ఎవరో తెలియాలంటే ఇంకో 24 గంటలు ఆగాల్సిందే!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com