
సెల్యులాయిడ్ పైనే కాదు ఓటిటిలో కూడా యూత్ కి పిచ్చెక్కించే చిత్రాలు తల్లక్కుమంటుంటాయి. ముఖ్యంగా నేటి తరం యువతని విపరీతంగా ఆకట్టుకునే భిన్నమైన కథాంశాలు, బోల్డ్ కంటెంట్, రిలేషన్‌షిప్ డ్రామాతో రూపొందే సిరీస్‌లకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ లో క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఆ కోవలోనే గత రెండు సీజన్లతో డిజిటల్ ఆడియన్స్‌ను ఊపేసిన పాపులర్ రొమాంటిక్ డ్రామా సిరీస్ 'ష్..' మొదటి రెండు భాగాల భారీ సక్సెస్ తర్వాత ఇప్పుడు మరింత హాట్, బోల్డ్ ఎమోషన్స్‌తో 'ష్.. సీజన్ 3' సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ వేదిక 'ఆహా' (aha) లో ఈ క్రేజీ సిరీస్ జూన్ 12, 2026 నుండి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ అవుతూ ట్రెండ్ అవుతోంది.
ఈ సరికొత్త మూడో సీజన్ లోని ప్రతి కథాంశం యువతకి టెంపర్ లేపేలా, సరికొత్త రిలేషన్‌షిప్స్ లోని సున్నితమైన అంశాలని చర్చిస్తూ సాగుతుంది. నేటి ఆధునిక కాలంలో మనుషుల మధ్య ఉండే సంబంధాలు, వ్యక్తిగత ఎమోషన్స్, సమాజానికి భయపడి దాచే రహస్యాలను ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆకర్షణ, వ్యామోహం, ఒకరినొకరు మోసం చేసుకోవడం వంటి క్లిష్టమైన లైఫ్ చాయిసెస్ ని చాలా బోల్డ్ గా ఎంటర్‌టైన్ చేస్తూ చూపించారు. అందుకే టీనేజ్ గ్యాంగ్ తో పాటు డిజిటల్ ఆడియన్స్ సైతం ఈ సరికొత్త సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ పై తెగ చర్చించుకుంటున్నారు.
ఆహా ఒరిజినల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ 'ష్.. సీజన్ 3' లో ప్రముఖ నటీనటులు తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా ఈ సీజన్ లో గ్లామరస్ బ్యూటీ పూనమ్ బజ్వా 'కామినీ' అనే కీలకమైన క్యారెక్టర్ లో కనిపించి హాట్ టాపిక్ గా నిలిచింది. ఆమెతో పాటు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కిరణ్ రాథోడ్, బిగ్‌బాస్ ఫేమ్ దివి వద్యా, దివ్యా గణేష్, మైఖేల్ తంగదురై, శ్యామల్ దత్తరాజ్, వర్ణ, నందిత శ్రీకుమార్ వంటి భారీ తారాగణం ఈ ఆంథాలజీ సిరీస్ లో భాగమయ్యారు. ప్రసిద్ధ దర్శకుడు హరీష్ జి.వై (HBK) ఈ సిరీస్ ను అద్భుతంగా తెరకెక్కించగా, ఆహోమ్ పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో రిచ్ గా నిర్మించారు.
Also read: ఆ డిజాస్టర్ మూవీ చూడలేదు.. అయితే 12000 చెల్లించాల్సిందేనని కోర్టు సంచలన తీర్పు
ప్రస్తుతం 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లో ఈ సిరీస్ లోని ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఓటీటీ కంటెంట్ తో దూసుకుపోతున్న ఆహా లో కేవలం ₹499 వార్షిక ప్లాన్ తో లాగిన్ అయి ఈ క్రేజీ బోల్డ్ రొమాంటిక్ సిరీస్ ని తెలుగు, తమిళ భాషల్లో వీక్షించవచ్చు.





