Home

»

Latest News

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి 25 ఏళ్ల ప్ర‌స్థానం.. భారతీయ సినిమాకు కొత్త హద్దులు చూపిన ద‌ర్శ‌క‌ధీరుడు.!

Sep 27, 2026 1:53PM

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సినీ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2001లో ‘స్టూడెంట్ నెం.1’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి.. అప్పటి నుంచి ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. సినిమా సినిమాకూ మరింత పెద్దగా కలలు కంటూ, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాజమౌళి కెరీర్‌ను పరిశీలిస్తే ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ రెండు భాగాలు, ‘ఆర్ఆర్ఆర్’ వరకు ప్రతి సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా ‘బాహుబలి’తో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆయన.. ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకుల అంచనాలను పెంచుతూ వచ్చిన రాజమౌళి.. 25 ఏళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహంతో, మరింత పెద్ద కలతో ముందుకు సాగుతున్నారంటూ ప్రశంసలు వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి 25 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రయాణాన్ని గుర్తుచేస్తూ చేసిన ఓ ప్రత్యేక పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలన్నింటినీ ప్రస్తావిస్తూ.. ప్రతి సినిమాతో ఇంకా ఏదో గొప్పది చేయాలనే తపనను కొనసాగిస్తున్నారంటూ ప్రశంసించారు.

25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తయినా రాజమౌళిలోని ఆ తపన ఏమాత్రం తగ్గలేదని, ఇప్పుడు ఆ ప్రయాణం ‘వారణాసి’ వైపు సాగుతోందని పేర్కొన్నారు. దీంతో రాజమౌళి తదుపరి సినిమా కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వారణాసి’తో ఆయన ఎలాంటి కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

 

[SS Rajamouli, 25 Years of SS Rajamouli, Rajamouli 25 Years, Rajamouli Cinema Journey, SS Rajamouli Career, Varanasi Movie, Mahesh Babu Varanasi, Rajamouli Varanasi, Telugu Cinema, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com