.webp)
ఘట్టమనేని మూడో తరం వారసుడు 'జయకృష్ణ' డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం. జయకృష్ణ తో పాటు మేకర్స్ మూవీ విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉండటంతో పాటు ప్రచార చిత్రాలు అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి
ఇక చిత్రసీమలో బాక్సాఫీస్ యుద్ధాలు కొత్తేమీ కాదు. కానీ ఒక అంతర్జాతీయ హాలీవుడ్ సూపర్ హీరో వర్సెస్ ఒక పక్కా లోకల్ తెలుగు గ్రామీణ డ్రామా ఎదురెదురు పడితే ఆ రచ్చ వేరే స్థాయిలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ ఈ నెల 30 న థియేటర్లలోకి అడుగుపెడుతున్న తరుణంలో, అదే రోజు రిలీజవుతున్న 'శ్రీనివాస మంగాపురం’ నిలబడగలదా అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఒకవైపు గ్లోబల్ మార్కెట్‌లో హాలీవుడ్ దిగ్గజం నిర్మించిన భారీ బడ్జెట్ స్పైడర్ మ్యాన్ చిత్రం దాదాపు 200 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చుతో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా 4,000 కు పైగా స్క్రీన్‌లలో విడుదలవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, భారీ గ్రాఫిక్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ హాలీవుడ్ చిత్రం ఇప్పటికే ఇండియా మొత్తం మీద 25 కోట్లకి పైగా ప్రీ సేల్స్ నమోదు చేస్తూ బాక్సాఫీస్‌పై తన పట్టును బిగించింది. ప్రతి నగరంలోని ఐమాక్స్, 3డి స్క్రీన్‌లు స్పైడర్ మ్యాన్ హవాకే కేటాయించబడటంతో థియేటర్ల లభ్యత పరంగా చిన్న సినిమాలకు పెద్ద సవాలుగా మారింది.
Also read: ఆ సినిమా ఫలితం తర్వాత మైత్రి మూవీ మేకర్స్ సంబరాలు..బయటపడ్డ పిక్స్
'శ్రీనివాస మంగాపురం' కి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 నుండి 500 వరకు సింగిల్ స్క్రీన్‌లు లభించే అవకాశాలు ఉన్నాయి. హాలీవుడ్ మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కాన్సెప్ట్‌కు భిన్నంగా, బి, సి సెంటర్ల ప్రేక్షకులని ఆకట్టుకునే బలమైన నేటివిటీ ఎమోషన్ ‘శ్రీనివాస మంగాపురం’ సొంతం. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, స్పైడర్ మ్యాన్ వంటి భారీ చిత్రాలు మొదటి వారంలో 70% కంటే ఎక్కువ కలెక్షన్లని మల్టీప్లెక్స్, ఎ-సెంటర్ల నుండే రాబడతాయి. కానీ మన తెలుగు ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్‌ల ఓపెనింగ్స్, స్థానిక కంటెంట్‌పై ఉండే ప్రేక్షకాదరణ ఎప్పుడూ ప్రత్యేకం. శ్రీనివాస మంగాపురం చిత్రానికి టాక్ పాజిటివ్‌గా వస్తే, 100% తెలుగు ప్రేక్షకులు తమ సొంత కథలకే ప్రాధాన్యం ఇస్తారనడంలో సందేహం లేదు.
Jaya Krishna, Srinivasa Mangapuram, Spider man







