Home

»

Latest News

'శ్రీనివాస మంగాపురం'కి ఊహించని రెస్పాన్స్.. బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే.?

Jul 30, 2026 3:45PM

ఘట్టమనేని వారసుడు జయకృష్ణ 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో.. మొదటి షో నుంచే థియేటర్ల వద్ద సందడి మొదలైంది. టాక్ కూడా బాగానే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ అయినప్పటికీ.. జయకృష్ణ తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ తో మెప్పించాడని ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద 'శ్రీనివాస మంగాపురం' సౌండ్ బాగానే వినిపిస్తోంది.

ప్రేక్షకుల నుండి లభిస్తున్న ఈ విశేష ఆదరణ ఇప్పుడు బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్‌మైషోలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. కేవలం గడిచిన ఒక్క గంట వ్యవధిలో ఏకంగా 1.33K కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడవ్వడం సినిమా సాధిస్తున్న రికార్డు స్థాయి క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. 

ఆఫ్ లైన్ లోనూ ఫుట్ ఫాల్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది. దాంతో యేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

మొత్తానికి 'శ్రీనివాస మంగాపురం' రూపంలో జయకృష్ణకు మంచి ఎంట్రీనే లభించింది. థియేటర్లలో రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

Jaya Krishna Ghattamaneni, Srinivasa Mangapuram, Bookings, Book My Show

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com