
భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనది అదేదో సువాసనని ఇచ్చే అగరబత్తి అన్నట్టుగా.. సినిమాకి, సినిమా ప్రేమికుడికి మధ్య అనుసంధానకర్త దర్శకుడు. అంటే సినీ సువాసనని ప్రేక్షకులని అందించడం కేవలం అతని చేతుల్లోనే ఉంది. అలాంటి దర్శకులకి ‘సెకండ్ మూవీ సెంటిమెంట్’ అనేది చాలా కాలంగా ఒక పెద్ద శాపంగా వేధిస్తోంది.
మొదటి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి, రికార్డు స్థాయి హిట్ కొట్టిన కొత్త దర్శకులు తమ రెండో చిత్రానికి వచ్చేసరికి తడబడటం టాలీవుడ్‌లో తరచూ చూస్తూనే ఉన్నాం. వినాయక్, రాజమౌళి, బోయపాటి శ్రీను, కొరటాల, అనిల్ రావిపూడి తప్ప చాలామంది టాలెంట్ ఉన్న దర్శకులు ఈ రెండో సినిమా పరీక్షలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేక తీవ్ర నిరాశ పరిచారు. ఇప్పుడు సరిగ్గా ఇదే సెంటిమెంట్ ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో అరంగేట్రం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విషయంలోనూ రిపీట్ అవుతోందా అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో ముమ్మరంగా సాగుతోంది. natural star నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరెకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను మూటగట్టుకుంటోంది.
.webp)
ఇది కూడా చదవండి: షాకింగ్: ఫరియా అబ్దుల్లా ఇల్లు కాస్ట్ ఎంతో తెలుసా!
విడుదలకి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఏకంగా 55 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి నాని కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ రికార్డును నమోదు చేసింది. అంతేకాక కేవలం డే-1 ప్రీ-సేల్స్ ద్వారానే ఇండియాలో ₹40.86 కోట్ల అడ్వాన్స్ వసూళ్లు సాధించి అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. 1980ల నాటి సికింద్రాబాద్‌లోని పారడైజ్ బ్యాక్‌డ్రాప్‌లో, గుర్తింపు లేని అణచివేతకు గురైన ఒక తెగ హక్కుల కోసం పోరాడే 'జడల్' పాత్రలో నాని ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులచేత జైజైలు కొట్టిస్తోంది. మొదటి సగం నిండా రక్తపాతం, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్, మరియు అనిరుధ్ అందించిన థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేశాయి.
అయితే ఇంటర్వెల్ తర్వాతే కథలో అసలైన సవాలు మొదలైంది. సెకండ్ హాఫ్‌లో బలహీనమైన స్క్రీన్‌ప్లే, స్లోగా సాగే కథనం, మరియు డెప్త్ లేని మదర్-సన్ ఎమోషన్ వల్ల ప్రేక్షకులు కొంత అసంతృప్తికి లోనవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల విజన్ చాలా గ్రాండ్‌గా ఉన్నప్పటికీ, ఎడిటింగ్ లోపాలు మరియు అతిగా అనిపించే వైలెన్స్ వల్ల సినిమా ఫ్లో దెబ్బతిన్నదని విమర్శలు వస్తున్నాయి.
[Srikanth Odela Second Movie Sentiment In The Paradise, The Paradise Movie Review, Srikanth Odela, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]






