ఈ డైరెక్టర్ కు కూడా మహేష్ కారు కొంటాడా..?
on May 16, 2016
ఇప్పుడున్న తెలుగు దర్శకుల్లో మన నేటివిటీని అద్భుతంగా చూపించే డైరెక్టర్ ఎవరంటే టక్కున వచ్చే పేరు శ్రీకాంత్ అడ్డాల. బాపు గారు వదిలిపెట్టి వెళ్లిన తెలుగు నేటివిటీ సినిమాలను శ్రీకాంత్ అడ్డాల కొనసాగిస్తున్నాడంటూ పొగుడుతుంటారు సినిమా జనాలు. శ్రీకాంత్ చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. అందులోనూ రెండు సినిమాలు సూపర్ స్టార్ మహేష్ తో చేశాడంటే శ్రీకాంత్ అడ్డాల స్థాయి ఎలా ఉంటుందో అని అందరూ అనుకుంటారు. అయితే శ్రీకాంత్ కు మాత్రం అలాంటి స్థాయిలు, స్థానాలు ఏమీ లేవు. విచిత్రంగా నేటికీ బైక్ మీదే ఆఫీస్ కు వస్తాడు. ఇన్ని మంచి సినిమాలు చేస్తూ, ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటున్న శ్రీకాంత్ కు ఇప్పటికీ కారు లేకపోవడం విచిత్రం. అందుకే మహేష్ కూడా బ్రహ్మోత్సవం ఆడియోలో, తనకు చాలా ఇష్టమైన స్వచ్ఛమైన డైరెక్టర్ శ్రీకాంత్ అని, ఇండస్ట్రీ జనాలతో ఎక్కువ కలవకపోవడంతో ఆయనకు ఇక్కడి లక్షణాలు అంటుకోలేదని అన్నాడు. శ్రీమంతుడు సక్సెస్ ను కొరటాల శివకు కార్ గిఫ్ట్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్న మహేష్, శ్రీకాంత్ కు కూడా కారు కొనిస్తే బాగుంటుందేమో కదా..!