Home

»

Latest News

Jurassic park: జురాసిక్‌ పార్క్‌లో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ 

Apr 15, 2026

-జురాసిక్ పార్క్ ప్రభంజనం తెలిసిందే
-ఇప్పటి వరకు ఆరు పార్టులు 
-నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు
-ఆఫర్ వదులుకున్న స్టార్ హీరోయిన్ 
-ఎందుకు అలా చేసింది

జురాసిక్ పార్క్(Jurassic Park).. ఈ పేరు వింటేనే చాలు ఇంకో పార్ట్ ఏమైనా రిలీజ్ అయ్యిందా అనుకోని చెక్ చేసే వాళ్ళు ఎంతో మంది. అంతలా జురాసిక్ పార్క్ ప్రేక్షకులతో కనెక్ట్ అయి ఉంది. 
దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్(Steven spielberg), రచయితలైన మిచెల్ క్రిచ్ టన్, డేవిడ్ కోప్ మేధస్సులో నుంచి ఉద్భవించిన ఆ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిలింకి అభిమాని కానీ వాళ్ళు ఉండరు. మరి అలాంటి మూవీలో ఆఫర్ వస్తే వదులుకునే హీరోయిన్ ఉంటుందా! అసలు ఇలాంటి న్యూస్ ఒకటి ప్రచురితం అవుతుందని అనుకున్నారా మీరు! ఏం చేస్తాం తప్పడం లేదు.  మరి ఆఫర్ వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో చూద్దాం.

శ్రీదేవి.. భారతీయ చిత్ర పరిశ్రమని తన అందంతో, అంతకంటే అందమైన నటనతో ఒక ఊపు ఊపిన అతిలోక సుందరి. ఈ అతిలోక సుందరినే జురాసిక్ పార్క్ లో అవకాశాన్ని వదులుకుంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతు 'జురాసిక్‌ పార్క్‌' లో చేసేటందుకు   నో చెప్పను. ఆ రోజుల్లో హాలీవుడ్‌ సినిమాలంటే ఏలియన్‌లా చేయడమే. కానీ, ఇప్పుడు అదొక గౌరవం. అయితే నాకు ఇండియన్ సినిమాని వదిలి పెట్టి హాలీవుడ్ సినిమాలని  చేయడం ఇష్టం లేదు. పైగా ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్నాను. అందుకే ఉన్నట్లుండి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని విడిచి పెట్టడం ఇష్టం లేక జురాసిక్ పార్క్ కి నో చెప్పానని చెప్పింది.  


also read: Shika: మూడు నెలల వయసుకే గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు 

ఇక శ్రీదేవి క్యారక్టర్ లో హాలీవుడ్‌ నటి ఏరియానా రిచర్డ్స్‌ ని మేకర్స్ తీసుకున్నారు. లేదంటే ఆమె చేసిన 'లెక్స్ మర్ఫీ' రోల్ లో శ్రీదేవి కనిపించేది. కథ ప్రకారం చూసుకుంటే ఎంతో ప్రాధాన్యత గల క్యారక్టర్. జురాసిక్ పార్క్ 1993 లో వచ్చింది. ఆ టైంలో శ్రీదేవి ఫుల్ స్వింగ్ లో ఉంది. కానీ ఇప్పుడు ఈ న్యూస్ చూసి ఫ్యాన్స్ మాత్రం మా శ్రీదేవి జురాసిక్ పార్క్ లో చేసి ఉంటే బాగుండేదనే కామెంట్స్ తో సదరు న్యూస్ కి వ్యూస్ ఎక్కువగా తీసుకొస్తున్నారు. మరి అతిలోక సుందరి న్యూస్ అంటే మాటలా. జురాసిక్ పార్క్ ఇప్పటి వరకు మొదటి భాగంతో కలుపుకొని ఆరు భాగాలుగా వచ్చింది. 

 


      
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com