
తక్కువ సమయంలోనే వరుస చిత్రాలతో బిజీగా మారి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న భామ శ్రీలీల. విచిత్రంగా అంతే తక్కువ సమయంలో వరుస ప్లాప్ లతో స్టిల్ తెలుగులో సినిమాలు లేని పరిస్థితి. ప్రస్తుతం తన లిస్ట్ లో ధనుష్ 'ఓం'తో పాటు బాలీవుడ్ మూవీ ఉంది. ఈ రెండు ఆడితే శ్రీలీల జాతకం మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో హిట్టునే అసలైన ఆత్మ బంధువు.
Also Read: ది ప్యారడైజ్ కోసం 2000 లీటర్ల రక్తం: ఆ రక్తం ఎవరిదో తెలుసా!
శ్రీలీల తోటి నటీనటుల పట్ల ఈగో ప్రదర్శిస్తోందని, తనతో సమానంగా నటించే నటులు గానీ నటీమణులు గానీ లేరనే గర్వంతో వ్యవహరిస్తోందంటూ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో నెగెటివ్ ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల మాట్లాడుతు 'నాతో సమానంగా నటించే నటుడు లేదా నటి ఎవరూ లేరని నేను గర్వపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. నాకు ఎలాంటి అహంకారం లేదు, నేనెప్పుడూ ఎవరి దగ్గరా ఈగో ప్రదర్శించలేదు. అందరినీ సమానంగా గౌరవించే మనస్తత్వం నాది. కాబట్టి ఇలాంటి అనవసర పుకార్లని ఎవరూ నమ్మకూడదు, వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నా ధ్యాస అంతా ప్రస్తుతం నటనపైనే ఉంది. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని పదిలపరుచుకోవడమే లక్ష్యం. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు దగ్గరవ్వడం తనకెంతో ఆనందంగా ఉందని, ఇరు రాష్ట్రాల అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది.

[Sreeleela, Ego Rumors, Dhanush, Om, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]






