ఇన్‌స్టాలో భర్తను అన్‌ఫాలో అయిన శ్రీజ.. ఆ ఇద్దరూ విడిపోతున్నట్లే!
on Jan 19, 2022

చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ తన పేరు చివర ఉన్న భర్త పేరును ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి తొలగించింది. దీంతో భర్త కల్యాణ్‌దేవ్ నుంచి ఆమె విడిపోయిందంటూ రూమర్స్ గుప్పుమంటున్నాయి. ఆ ఇద్దరికీ 2016 మార్చిలో వివాహం జరిగింది. ఇద్దరికీ ఒక పాప కూడా ఉంది. కొంత కాలంగా శ్రీజ, కల్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూ వస్తోంది కానీ ఇద్దరిలో ఎవరూ తాము విడిపోతున్నామనే విషయాన్ని ధ్రువీకరించలేదు.
Also read: ధనుష్, ఐశ్వర్యను కలిపేందుకు రజనీ విఫలయత్నం!
అయితే ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ పేరును శ్రీజ మార్చడంతో అందరి దృష్టీ దానిపై మళ్లింది. ఇదివరకు ఆమె "Sreeja Kalyan" అనే పేరును ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కోసం వాడేది. సోమవారం ఆమె తన పేరును 'sreeja konidela' గా మార్చేసుకుంది. అంతేకాదు, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కల్యాణ్‌దేవ్‌ను అన్‌ఫాలో అవడం గమనార్హం.
Also read: ధనుష్-ఐశ్వర్య ఎందుకు విడిపోయారు?
2016 మార్చిలో బెంగళూరులోని దేవనహళ్లి దగ్గరున్న ఒక ఫామ్‌హౌస్‌లో శ్రీజ, కల్యాణ్ వివాహం జరిగింది. వారికి నవిష్క అనే కూతురు పుట్టింది. శ్రీజకు ఇది రెండో పెళ్లి. అంతకు ముందు ఆమె శిరీష్ భరద్వాజ్‌ను వివాహమాడింది. వారు 2011లో విడిపోయారు. వారికి నివృతి అనే కుమార్తె ఉంది. ఆ కుమార్తెను తనే పెంచుకుంటూ వస్తోంది శ్రీజ.
ఇప్పుడు వరుసగా ఒకరి తర్వాత ఒకరుగా సెలబ్రిటీ జంటలు విడిపోతున్న వార్తలు మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. ఇటీవలే నాగచైతన్య-సమంత విడిపోగా, లేటెస్ట్‌గా ఐశ్వర్య నుంచి తాను విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు ధనుష్. అదే బాటలో శ్రీజ, కల్యాణ్‌దేవ్ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కల్యాణ్‌దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



