Home

»

Latest News

sreeja konidela: తప్పు తెలుసుకొని పూర్తిగా మారిపోయాను.. శ్రీజ కొణిదెల ఎమోషనల్ వీడియో వైరల్ 

Jun 10, 2026 2:30PM

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)చిన్న కుమార్తె, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)సోదరి శ్రీజ(sreeja)కొణిదెల తన జీవితంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలపై తొలిసారి బహిరంగంగా నోరు విప్పారు. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకొని శ్రీజ  రీసెంట్ గా  ఇన్‌స్టాగ్రామ్‌లో  ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


సదరు వీడియోలో శ్రీజ మాట్లాడుతు 'ఇదంతా నాకే ఎందుకు జరుగుతోంది? నేనెందుకు ఇంత వేదన అనుభవించాలి? ఒకదాని  తర్వాత మరొకటిగా  కష్టాలు చుట్టుముడుతున్నాయేంటి? నేనేం పాపం చేశానని ఇంత క్షోభ అనుభవిస్తున్నాను?"  అని అనుకుంటూ చాలాకాలం పాటు నాలో నేనే తీవ్రంగా మథనపడ్డాను. ఒకానొక దశలో సమాజం ముందు నేనొక బాధితురాలిగా మిగిలిపోయాననే భయం, గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలే నా అసలైన గుర్తింపుని  శాసిస్తున్నాయనే ఆందోళన నిరంతరం వేధించాయి. 19 ఏళ్ల వయసులోనే  జరిగిన మొదటి వివాహం, ఆ తర్వాత పోలీస్ కేసులు, 2014లో విడాకులు.. మళ్లీ 2016లో రెండో వివాహం, 2022లో ఆ బంధం కూడా విచ్ఛిన్నం కావడం వంటి వరుస సంఘటనలు  మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి.


Also read: kangana ranaut: భారత్ భాగ్య విధాత మూవీకి మన ముఖ్యమంత్రి బంపర్ ఆఫర్

అయితే ఆ చీకటి పరిస్థితుల నుంచి భయటపడటానికి 15 నెలల పాటు 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' అనే ప్రత్యేక మానసిక పరివర్తన ప్రోగ్రాం ఫాలో అయ్యాను. అది  నా  ఆలోచన  దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ ప్రయాణం ద్వారా నేను  బాధితురాలిని ( అనే బలహీనమైన భావన నుంచి పూర్తిగా బయటపడ్డాను. జీవితం మనకి ఊరికే జరిగిపోదు.. మన జీవితాన్ని మనమే సృష్టించుకోగల మనోధైర్యం, శక్తి మనలోనే ఉన్నాయి అనే గొప్ప సత్యాన్ని గ్రహించాను. బాధ అనేది  జీవితంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. కానీ అదే  పూర్తి జీవితం కాదు. మనిషి అంతరంగంలో ఎన్నో అద్భుతమైన లేయర్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా అన్వేషించడం ఈ ప్రయాణంలో అత్యంత అందమైన విషయమని శ్రీజ చెప్పుకొచ్చింది.  ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com