Home

»

Latest News

ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు.. శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ నుంచి మాస్ సాంగ్.!

Sep 29, 2026 9:00PM

విభిన్నమైన కథలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు విడుదల కాగా.. తాజాగా మూడో సింగిల్‌ను చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.

ఈ పాటకు ప్రముఖ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. నల్గొండ గద్దర్ నర్సన్న తనదైన శైలిలో ఆలపించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్‌లో మాస్ బీట్‌తో పాటు పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా లిరిక్స్ ఉన్నాయి. సినిమా కథకు తగ్గట్టుగా ఈ పాటను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కొనసాగింపుగా వచ్చిన ఈ మూడో సింగిల్‌తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.

‘కామ్రేడ్ కళ్యాణ్’లో శ్రీ విష్ణుకు జోడీగా మహిమా నంబియార్ కనిపించనుండగా.. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1992 నాటి ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. శ్రీ విష్ణు ఈ సినిమాలో ‘కామ్రేడ్ కళ్యాణ్’గా ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం పాటలతో పాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది చిత్రబృందం.

 

 

[Sree Vishnu, Comrade Kalyan, Comrade Kalyan Song, Etthara Etthu Song, Sree Vishnu Latest Movie, Mahima Nambiar, Vijai Bulganin, Bhaskarabhatla, Nalgonda Gaddar Narsanna, Comrade Kalyan Release Date]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com