Home

»

Latest News

Sree Vishnu: 'పోరాట సింహం'గా మారుతున్న శ్రీవిష్ణు.. మామూలు ట్విస్ట్ కాదిది!

Apr 30, 2026

ఇటీవల ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ 'గాయపడ్డ సింహం' (Gaayapadda Simham). మే 1న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy) పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా జేడీ చక్రవర్తి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో సీరియస్ విలన్‌గా ఉండి, సెకండ్ హాఫ్‌లో ఫుల్ లెంగ్త్ కామెడీతో అలరిస్తుందని సమాచారం. అమెరికా వీసా కోసం ప్రయత్నించే యువకుల కథాంశంతో, సెటైరికల్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించారు.

శ్రీవిష్ణు ‘సర్‌ప్రైజ్‌ ప్యాకేజీ’
ఈ చిత్రంలో అసలైన ఆకర్షణ శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన ఇందులో ఒక కీలకమైన ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అయితే కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, సినిమా క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ఎంట్రీ అద్భుతంగా ఉంటుందని టాక్. 

క్లైమాక్స్ ట్విస్ట్:
'గాయపడ్డ సింహం' సినిమా క్లైమాక్స్ లోనే సీక్వెల్ కి సంబంధించిన లీడ్ ఇస్తారట. క్లైమాక్స్ లో టైటిల్ కార్డు వేసి, సీక్వెల్ గా 'పోరాట సింహం' చిత్రాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ప్రత్యేక పాత్రలో కనిపించే శ్రీవిష్ణు, సెకండ్ పార్ట్ అయిన 'పోరాట సింహం'లో పూర్తి స్థాయి హీరోగా నటించబోతున్నారని సమాచారం.

'గాయపడ్డ సింహం'లో స్పూఫ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తాయని అంటున్నారు. పలు భారీ సినిమాల రిఫరెన్స్ లతో సినీ ప్రియులకు పండగలా ఈ సినిమా ఉంటుందట. ఇక ఆ స్పూఫ్ ఎపిసోడ్స్ లో శ్రీవిష్ణు పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.

తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్, జేడీ చక్రవర్తి ఇంటెన్సిటీ, శ్రీవిష్ణు సర్ప్రైజ్ ఎంట్రీ.. ఇవన్నీ కలిపి 'గాయపడ్డ సింహం' సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. క్లైమాక్స్ లో వచ్చే 'పోరాట సింహం' అనౌన్స్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ వేసవిలో మే 1న థియేటర్లలో ఈ 'సింహం' ఏ రేంజ్ లో గర్జిస్తుందో చూడాలి.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com