Home

»

Latest News

మా సినిమాను తెలుగులో రిలీజ్ చేసుకుంటాం.. ప్రభాస్ సినిమాను హిందీలో రిలీజ్ చేసుకోమనండి.!

Jul 14, 2026 6:07PM

"SPIRIT IS NOT ONE" చిత్ర టైటిల్‌కు సంబంధించి ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ T-Series పంపిన నోటీసులపై, వారు విధించిన షరతులపై చిత్ర నిర్మాతలు చిన్నబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ ద్వారా తీవ్రంగా స్పందించారు.

T-Series పంపిన నోటీసులోని షరతులు ఏమిటి?

​హిందీ రైట్స్ ఇవ్వబోం: 'SPIRIT' అనే పదంపై మాకే హక్కులు ఉన్నాయి కాబట్టి, మీ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకోవాలి. హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి లేదా హిందీ రైట్స్ అమ్ముకోవడానికి వీల్లేదు.

కేవలం తెలుగులోనే ప్రమోషన్స్: "SPIRIT IS NOT ONE" అనే పేరుతో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే థియేటర్లలో, ఓటీటీ లేదా యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటేనే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుంటాము.

T-Series షరతులపై ప్రెస్ మీట్‌లో చిత్ర నిర్మాతల ఘాటైన కౌంటర్:

​మా సినిమా.. మా ఇష్టం! చెప్పడానికి మీరెవరు?: "మా సినిమాను మేము ఎవరికి అమ్ముకోవాలి? ఎక్కడ, ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసుకోవాలి అనేది మా వ్యక్తిగత విషయం. దానిని శాసించడానికి, మాపై నిబంధనలు పెట్టడానికి T-Series సంస్థ ఎవరు?" అని నిర్మాతలు ప్రశ్నించారు.

మేము తెలుగులోనే రిలీజ్ చేస్తాం.. ప్రభాస్ సినిమా హిందీలో చేసుకోమనండి: 
"మేము మా సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకుంటాము. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో T-Series తీస్తున్న 'SPIRIT' సినిమాను వారు హిందీలో హ్యాపీగా రిలీజ్ చేసుకోమనండి. దానికి మాకేం అభ్యంతరం లేదు" అని స్పష్టం చేశారు.

​ఒప్పందానికి అంగీకరించేది లేదు: ఒక సినిమాను ఏ భాషలో రిలీజ్ చేయాలి, ఎలా అమ్ముకోవాలి అనే హక్కుల విషయంలో కార్పొరేట్ సంస్థల బెదిరింపులకు భయపడేది లేదని, ఈ ఏకపక్ష షరతులకు తాము అంగీకరించడం లేదని చిత్ర బృందం తెగేసి చెప్పింది.

​మా సినిమా హక్కులను, స్వేచ్ఛను కాపాడుకుంటూనే, తెలుగు ప్రేక్షకులకు త్వరలోనే "SPIRIT IS NOT ONE" సినిమాను థియేటర్లలో అందిస్తామని నిర్మాతలు ప్రకటించారు.

 

 

SPIRIT IS NOT ONE, Prabhas, Spirit, Sandeep Reddy Vanga

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com