Home

»

Latest News

'స్పైడర్ మ్యాన్' బాక్సాఫీస్ సునామీ.. ఆల్‌టైమ్ సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్‌పై కన్ను.!

Jul 28, 2026 4:05PM

మార్వెల్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక సూపర్ హీరో చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాకముందే సరికొత్త బాక్సాఫీస్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. టామ్ హాలాండ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ, ఓపెనింగ్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు $800 మిలియన్ల నుండి $825 మిలియన్ల (రూ. 6,700 కోట్లకు పైగా) గ్రాస్ వసూళ్లను సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈ అంచనాలు నిజమైతే, ప్రపంచ సినిమా చరిత్రలోనే 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ($1.223 బిలియన్లు) తర్వాత ఆల్‌టైమ్ రెండవ అతిపెద్ద గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' నిలవనుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ హాలీవుడ్ వండర్ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల నివేదికల ప్రకారం, భారతదేశంలో ఈ చిత్రం అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఇప్పటికే ఏకంగా ₹60 కోట్ల మార్కును దాటేశాయి. ఇదివరకు తొలిరోజు ఇండియాలో ₹50 కోట్ల నుండి ₹60 కోట్ల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందని భావించినప్పటికీ, నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్‌లో అడ్వాన్స్ టికెట్ల విక్రయాలు ఊహించని వేగంతో జరుగుతుండటంతో మొదటిరోజు కలెక్షన్స్ ఊహకందని స్థాయికి చేరేలా కనిపిస్తున్నాయి.

'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత టామ్ హాలాండ్ మళ్లీ పీటర్ పార్కర్‌గా రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అభిమానుల్లో అంచనాలు పీక్స్‌కు చేరాయి. ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్‌లకు పెరిగిన విపరీతమైన డిమాండ్, ట్రైలర్లకు వచ్చిన అనూహ్య స్పందన, ఈ చిత్రం కోసం జరుగుతున్న భారీ అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కలిసి ఈ 2026 నాటి బిగ్గెస్ట్ థియేట్రికల్ ఈవెంట్‌గా మార్చేశాయి. 

భారతీయ ప్రేక్షకులలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ, ఈ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' థియేట్రికల్ స్క్రీనింగ్స్‌తో పాటు మార్వెల్ తరువాతి భారీ చిత్రం 'అవెంజర్స్: డూమ్స్‌డే' ఫస్ట్ ట్రైలర్‌ను కూడా అటాచ్ చేసి ప్రదర్శించనున్నారనే వార్తలు ఇక్కడి మార్వెల్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారాయి.

జూలై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం, ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్, మాస్ క్రేజ్‌ను బట్టి చూస్తే భారతదేశంలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' పేరిట ఉన్న ఆల్‌టైమ్ హాలీవుడ్ రికార్డులను సైతం గట్టిగా సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది. 

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద $800-$825 మిలియన్ల రికార్డు ఓపెనింగ్‌తో పాటు, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాల జాబితాలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సిద్ధమైంది.

 

 

Spider Man Brand New Day, Opening Weekend, Spider Man

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com