
హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని క్రేజ్ ఉందని మరోసారి నిరూపితమైంది. మార్వెల్ సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఇండియన్ సినీ చరిత్రలో ఒక హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం అరుదైన విషయంగా మారింది. విడుదలైన మొదటి వీకెండ్ లోనే బాక్సాఫీస్ లెక్కలన్నింటినీ ఈ సినిమా తిరగరాసింది. కేవలం మొదటి వారంలోనే ఈ చిత్రం భారతదేశ వ్యాప్తంగా ఏకంగా రూ.309 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక హాలీవుడ్ ఫ్రాంచైజ్ సాధించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్స్ లో ఒకటిగా ఇది సరికొత్త మైలురాయిని చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తూ రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటిదాకా 927 మిలియన్ డాలర్ల (రూ.8,800 కోట్లకు పైగా) వసూళ్లను రాబట్టింది.
వీకెండ్ ముగిసినప్పటికీ, వర్కింగ్ డేస్‌లో కూడా ఈ సినిమా బుకింగ్స్ ఊహించని రేంజ్‌లో హోల్డ్ అవ్వడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేటను కొనసాగిస్తున్న ఈ సూపర్ హీరో సినిమా లాంగ్ రన్‌లో ఇంకా ఎన్ని వందల కోట్ల రికార్డులను క్రియేట్ చేయబోతోందో వేచి చూడాల్సిందే.
Spider Man Brand New Day, First Weekend, Collection, India






