
లేటెస్ట్ హాలీవుడ్ సెన్సేషన్ 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా ₹131 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది.
ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అతిపెద్ద హాలీవుడ్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ హోల్డర్‌గా ఉన్న 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' దాదాపు ₹65 కోట్లతో టాప్‌లో ఉండేది. కానీ టామ్ హోలాండ్ నటించిన ఈ సరికొత్త స్పైడర్-మ్యాన్ మూవీ మొదటి రోజే ఏకంగా ₹73 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఆ పాత రికార్డుని తుడిచేసింది.
స్పైడర్-మ్యాన్ అంటే మన ఇండియన్ ఆడియన్స్‌కు ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచి టీవీల్లో చూస్తూ పెరిగిన క్యారెక్టర్ ఇది. అందుకే మొదటి రోజునే 73 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ బొమ్మ, రెండో రోజు కూడా అదే రేంజ్‌లో హోల్డ్ చేసింది. వర్కింగ్ డే అయిన శుక్రవారం రోజు కూడా ఏకంగా 58 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే టోటల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ 131 కోట్లు దాటేసింది.
ప్రస్తుత జోరు చూస్తుంటే.. మొదటి వారంలోనే ₹200 కోట్ల మార్క్‌ను దాటేసి ఆల్ టైమ్ హాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసేలా ఉంది ఈ స్పైడర్ మ్యాన్.

Spider Man Brand New Day, Box Office, India






