Home

»

Latest News

రెండేళ్లుగా ఎదురుచూపులు.. ఎట్టకేలకు ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సోనీ చేతికి.!

Nov 23, 2026 4:15PM

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా తెలుగు బుల్లితెరపై మాత్రం ఇంకా ప్రసారం కాలేదు. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనూ ప్రేక్షకులను అలరించింది. 

అయితే టీవీ ప్రీమియర్ విషయంలో మాత్రం అభిమానులకు నిరీక్షణ తప్పలేదు. ఈ క్రమంలో తాజాగా ‘దేవర’ శాటిలైట్ హక్కులకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. త్వరలో తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టనున్న సోనీ తెలుగు ఛానెల్ ‘దేవర’ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ వంటి స్టార్ సినిమాతో కొత్త ఛానెల్ తన ప్రయాణాన్ని ప్రారంభించాలని భావిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

 

సోనీ తెలుగు ఛానెల్ 2027 ప్రారంభంలో స్టార్ట్ కానుందని సమాచారం. ఇప్పటికే కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను సోనీ సంస్థ  దక్కించుకుంది. దీంతో కొత్త ఛానెల్ కోసం ఇప్పటి నుంచే తెలుగు సినిమాల లైబ్రరీని సిద్ధం చేసుకుంటోందనే చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: ‘డ్రాగన్‌’లో చర్చి సీక్వెన్స్‌.. ఎన్టీఆర్‌, రుక్మిణి వసంత్‌పై భారీ పెళ్లి వేడుక!

‘దేవర’ శాటిలైట్ హక్కుల విషయంలో గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఈటీవీ ఈ హక్కులను దక్కించుకున్నట్లు మే 2026లో వార్తలొచ్చాయి. అంతకుముందు స్టార్ గ్రూప్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా సోనీ తెలుగు పేరు తెరపైకి వచ్చింది.

మరి నిజంగానే సోనీ తెలుగు ఈ సినిమా హక్కులను దక్కించుకుందా? కొత్త ఛానెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ‘దేవర’ టెలివిజన్ ప్రీమియర్ ఉంటుందా? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మీకు నచ్చవచ్చు: 
బిగ్ సర్‌ప్రైజ్‌.. ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు మూవీ.!
మూడు రోజుల్లోనే 100 కోట్లు.. ధనుష్‌ ‘OM’ బాక్సాఫీస్‌ దూకుడు.!

 

 

 

[Devara Movie, Satellite Rights, Sony Telugu, Jr NTR, Koratala Siva]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com