
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి మరో కొత్త ఛానెల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనీ.. ఇప్పుడు తెలుగు టెలివిజన్ రంగంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగులో ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఏర్పాటు చేసే దిశగా సంస్థ గట్టిగానే బ్యాక్‌ఎండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగులో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల మధ్య గట్టి పోటీ ఉంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ఛానెళ్లు సీరియళ్లు, రియాలిటీ షోలు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సోనీలివ్ కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కొత్త తరహా సీరియళ్లు, రియాలిటీ షోలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తే ఇప్పటికే ఉన్న ఛానెళ్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ కొత్త ఛానెల్ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఎలాంటి కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతానికి సోనీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే తెలుగు బుల్లితెరపై మరో కొత్త పోటీ మొదలైనట్టే.
ఇది కూడా చదవండి: సాయి ధరమ్ తేజ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వధువు ఎవరు.?
[Sony Telugu Entertainment Channel, Sony Telugu TV Channel, Sony New Channel, Sony Telugu Channel, ETV Telugu, Zee Telugu, Star Maa, Telugu News]






