
సోనియా గాంధీ.. రాజకీయాలు తెలియని వాళ్ళ నోళ్ళల్లో సైతం నిత్యం 'సోనియా గాంధీ' అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది. భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన మహిళా నేతగా గుర్తింపు సైతం ఆమె సొంతం ఈ కాంగ్రెస్ అగ్రనేత్రి జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఇటీవల నవంబర్ 10న విడుదలైన ఆమె 544 పేజీల ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ, ఈ పుస్తకం ఆధారంగా తెలుగులో ఒక భారీ బయోపిక్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించాడు.
సంగారెడ్డిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు . ఈ సినిమా నిర్మాణం కోసం ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు . 2 కోట్ల విరాళాన్ని ప్రకటించగా, ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడానికి గాంధీ భవన్ పీఆర్ఓ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 50 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ ప్రకటన వెలువడినప్పటి నుంచే సోనియా గాంధీ పాత్రలో ఏ హీరోయిన్ కనిపిస్తారనే దానిపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన ఊహాగానాలు మొదలయ్యాయి.
దర్శకుడు లేదా నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ, సోనియా గాంధీ జీవితంలోని విభిన్న దశలను తెరపై ఆవిష్కరించగల సత్తా ఉన్న ఐదుగురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరీనా కపూర్ ఖాన్ పేరు మొదటి వరుసలో ఉంది. ఇటలీలో పుట్టిన ఒక సాధారణ యువతి నుంచి, భారత రాజకీయాలను శాసించే అగ్రనేతగా ఎదిగిన తీరును తన అద్భుతమైన నటనతో కరీనా పండించగలరని అభిమానులు భావిస్తున్నారు.
.webp)
మరోవైపు, గతంలో 'రాజనీతి' సినిమాలో రాజకీయ నాయకురాలిగా అద్భుతంగా నటించిన కత్రినా కైఫ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఆ సినిమా కోసం ఆమె ప్రియాంక గాంధీ ప్రసంగాలను, హావభావాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నేపథ్యంలో, సోనియా గాంధీ పాత్రకు కత్రినా అయితే రూపం పరంగా, నటన పరంగా సరిగ్గా సరిపోతారని పలువురు విశ్లేషిస్తున్నారు. వీరితో పాటు లోతైన భావోద్వేగాలను కళ్లతోనే పలికించగల షెఫాలీ షా, గతంలో 'సంజు' చిత్రంలో నర్గీస్ దత్ పాత్రలో ఒదిగిపోయిన మనీషా కొయిరాలా, అలాగే హుందాతనంతో కూడిన పాత్రలకు పెట్టింది పేరైన సీనియర్ నటి టబు పేర్లు కూడా ఈ రేసులో ప్రచారంలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: అంగరంగ వైభవంగా జరిగిన ప్రముఖ హీరో పెళ్లి: ఆ హీరో అన్న కొడుకు కూడా!
ఇటలీలోని ఒక చిన్న గ్రామంలో 1946లో జన్మించిన సోనియా మైనో, కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీని ప్రేమించి 1968లో వివాహం చేసుకున్నారు. అత్తగారు ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ హత్యల వంటి తీవ్ర విషాదాలను తట్టుకుని, కుటుంబాన్ని నిలబెట్టిన తీరు ఎంతో భావోద్వేగభరితం. 2004లో ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసి, డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఆ బాధ్యతలు అప్పగించిన చారిత్రక ఘట్టం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

మరి జగ్గారెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ బయోపిక్‌లో సోనియా గాంధీగా కనిపించే ఆ అదృష్టవంతురాలైన హీరోయిన్ ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మీకు నచ్చవచ్చు:పాపని కడుపులో ఉంచుకొని వంద సిగరెట్లు తాగిన హీరోయిన్!
మీకు నచ్చవచ్చు: పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకులపై: లేటెస్ట్ అప్ డేట్ ఇదే!
[Sonia Gandhi, Sonia Gandhi Biopic, Belonging A Journey of Love movie, Tollywood, Bollywood]




