Home

»

Latest News

'బూట్‌ క‌ట్ బాల‌రాజు' గెట‌ప్‌లో సొహేల్ ఆక‌ట్టుకుంటున్నాడు

Apr 18, 2022 4:57PM

 

సొహేల్, అన‌న్య నాగ‌ళ్ల ('వ‌కీల్‌ సాబ్' ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'బూట్ క‌ట్ బాల‌రాజు'. ల‌క్కీ మీడియాతో క‌లిసి గ్లోబ‌ల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. బెక్కెం బ‌బిత స‌మర్ప‌ణ‌లో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కొన్నేటి ద‌ర్శ‌కుడు. సోమ‌వారంనాడు సోహెల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ బూట్ క‌ట్ బాల‌రాజు గ్లింప్స్ విడుద‌ల చేసింది.

"రింగు రింగు రూపాయ్ బిళ్ళ రూపాయి దండ‌.." అంటూ సాగే పాట‌తోపాటు సోహెల్ యాక్ష‌న్ సీన్స్ ఆక‌ర్ష‌ణీయంగా వున్నాయి. దానికితోడు ఊరికి ఒక మంచి ప‌ని చేసినావ్‌ర్రా అంటూ ఒక‌రు అడిగితే.. సోహెల్ చెప్పే స‌మాధానం ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. మొత్తంగా గింప్స్ మంచి ఆద‌ర‌ణ పొందుతోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, "ర‌చ‌యిత ఫ‌ణి, రాకేష్‌, అశోక్ కుమార్ టీమ్‌గా ఫామ్ అయి మంచి క‌థ‌ను అందించారు. 9నెల‌లుగా క‌థ‌ను రెడీ చేసి షూటింగ్‌కు వెళ్ళాం. ఏక‌ధాటిగా సాగిన షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈరోజు సొహేల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బూట్ క‌ట్ బాల‌రాజు గ్లింప్స్ విడుద‌ల చేశాం. కుటుంబంతో క‌లిసి హాయిగా చూడ‌త‌గ్గ సినిమా అవుతుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తా"మ‌ని అన్నారు.

సొహేల్ ర్యాన్‌ మాట్లాడుతూ, "క‌థ బాగుంటే అన్నీ క‌లిసి వ‌స్తాయి. బిగ్‌బాస్‌లో వ‌చ్చిన పేరు వేరు. సినిమా ద్వారా వ‌చ్చే పేరు వేరు. అందుకే న‌న్ను న‌మ్మి థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు మంచి ఎంట‌ర్‌టైన్ మెంట్ ఇచ్చేలా కృషి చేస్తున్నా"న‌ని అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com