
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)బ్లాక్ బస్టర్ హిట్ సింహాలో బాలకృష్ణతో జత కట్టిన భామ స్నేహ ఉల్లాల్(Sneha Ullal). ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ వంటి విజయవంతమైన చిత్రాలతో కూడా చేసి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్య రాయ్ పోలికలతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బ్యూటీ, కెరీర్ ఆరంభంలోనే భారీ ఆఫర్లు అందుకుంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలతో పాటు కొన్ని భావోద్వేగ విషయాలని పంచుకుంది.
ఆమె మాట్లాడుతు కేవలం 16 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' తో పరిచయమయ్యాను. అంత చిన్న వయసులోనే అడుగుపెట్టడానికి మా అమ్మ ఆరోగ్యం. ఆ సమయంలో అమ్మ క్యాన్సర్ బారిన పడటంతో, అమ్మ వైద్య ఖర్చులు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాల్సిన బాధ్యత పడింది.బాలీవుడ్ ఎంట్రీతో ఒకే ఒక్క రాత్రిలో స్టార్‌డమ్ లభించినప్పటికీ, మానసికంగా తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. ఆ వయసులో సినిమా ప్రపంచం గురించి, గ్లామర్ ఇండస్ట్రీలోని నెగెటివిటీ గురించి కనీస అవగాహన కూడా లేదు.
Also read: Sitara Entertainments: నాగవంశీ చేతికి బ్లాస్ట్ జోన్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బ్లాస్టే
సినిమాల్లోకి రావడం వల్ల అమూల్యమైన టీనేజ్ జీవితాన్ని పూర్తిగా కోల్పోయాను. తోటి పిల్లల్లా స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం, ఎంజాయ్ చేయడం వంటి లేవు. కంటి నిండా నిద్ర, ప్రశాంతత అన్నీ కోల్పోవాల్సి వచ్చింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తీవ్రమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ బారిన పడటం వల్ల దాదాపు 4 సంవత్సరాల పాటు నడవలేని స్థితికి చేరుకున్నాను . రక్తం తక్కువైపోయి, కనీసం అరగంట పాటు నిలబడే ఓపిక కూడా లేకపోవడంతో పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మళ్ళీ నటిస్తానని స్నేహ చెప్పుకొచ్చింది.






