.jpg)
తెలుగులో హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించిన స్నేహ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తానని తనకు తెలిసిన దర్శకనిర్మాతలను అడుగుతోంది. కొన్నేళ్ళ క్రితం నటుడు ప్రసన్నను వివాహమాడిన స్నేహ సినిమాలతో మాత్రం తన బంధాన్ని తెంచుకోలేకపోతుంది. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయిపోతుండడం చూస్తుంటాం. కానీ పెళ్లయ్యి ఒక బిడ్డ పుట్టిన తరువాత కూడా నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటానంటుంది స్నేహ. ప్రస్తుతం తనకు హీరోయిన్ రోల్స్ రావడం కష్టం. అందుకే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కోసం దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతోంది. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన స్నేహ ఆ తరువాత మరే సినిమాలో కనిపించలేదు. ఇకనైనా తనకు అవకాశాలు వస్తాయేమో చూడాలి!






