Home

»

Latest News

ఆ విషయం మరిచారా పూరి గారు.. సినీ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న న్యూస్ 

Jul 16, 2026 10:52AM

 

వైవిధ్యమైన కంటెంట్ తో కూడిన చిత్రాల దర్శకుడిగా తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేసాడు పూరి జగన్నాధ్(Puri Jagannadh). లాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టే వచ్చి ప్రెజెంట్ మళ్ళీ  హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో చేస్తున్న అప్ కమింగ్ మూవీ స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ ఇప్పుడు కంటెంట్ ఎంత ముఖ్యమో, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే పబ్లిసిటీ కూడా అంతే ముఖ్యం. ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా, ఎంతటి సంచలన దర్శకుడు తెరకెక్కించినా సరైన ప్రమోషన్స్ లేకపోతే ఓపెనింగ్స్ రావడం కష్టమనేది నేటి ట్రెండ్. ఈ క్రమంలోనే ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ గురించి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూరి ఇండస్ట్రీలోకి వచ్చి 26 ఏళ్లు దాటిన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు. విజయ్ సేతుపతి ఏకంగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తనే స్వయంగా టీజర్ డబ్బింగ్ కూడా పూర్తి చేసేశాడు. కానీ ఆ తర్వాత నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎందుకో సైలెంట్ అయిపోయారు.

మొదట్లో ఈ సినిమా టీజర్ జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఒక పక్క విజయ్ సేతుపతి నుంచి రాబోయే  'ట్రైన్' వంటి ఇతర సినిమాలు ఆగస్టు విడుదలకు సిద్ధమవుతూ జోరుగా ప్రమోషన్స్ జరుపుకుంటుంటే ‘స్లమ్ డాగ్’ అప్‌డేట్స్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. 


తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా మొత్తం 5 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.మరి ఇలాంటి హై వోల్టేజ్ ప్రాజెక్ట్‌ను కేవలం థియేట్రికల్ రిలీజ్ కోసమే కాకుండా ఓటీటీ బిజినెస్ క్లోజ్ చేసుకోవాలన్నా సోషల్ మీడియాలో నిరంతరం బజ్ మెయింటైన్ చేయడం  అవసరం. మరి ఇప్పటికైనా పూరి కనెక్ట్స్ టీమ్ మేల్కొని, టీజర్ రిలీజ్ డేట్‌తో పాటు ప్రమోషన్స్ షెడ్యూల్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తుందో లేదో చూడాలి.

'యానిమల్', 'అర్జున్ రెడ్డి' చిత్రాల ఫేమ్ నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ నుంచి వస్తున్న స్లమ్ డాగ్ లో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణం  ఉన్నారు.పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ తమ ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై జేబీ మోషన్ పిక్చర్స్‌తో కలిసి  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా రక్తంతో తడిసిన కత్తి పట్టుకుని, కరెన్సీ నోట్ల మధ్య మాస్ లుక్‌లో విజయ్ సేతుపతి కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల చేత స్లమ్ డాగ్  కోసం వెయిట్ చేసేలా చేస్తుంది.

vijaysethupathi, puri jagannadh, slum dog, charmy

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com