Home

»

Latest News

Skn: ఎస్ కె ఎన్ ఆసక్తికరవ్యాఖ్యలు.. అది మన క్రష్‌ అయితే, ఏ క్రష్ అయినా మనతో రావాల్సిందే

Jul 1, 2026 6:29PM

 

 

బేబీ ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తన కొత్త చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న ఎస్ కే ఎన్ రీసెంట్ గా   “సమ్మర్ హాలిడేస్” అనే మూవీ  సాంగ్ లాంచ్ ఈవెంట్  కి హాజరయ్యాడు.     


ఆ ఈవెంట్ లో ఎస్.కే.ఎన్ మాట్లాడుతు 'మన చిన్నప్పుడు థియేటర్లలో   'చిన్నారి చేతన్', 'బాల భారతం', 'లిటిల్ సోల్జర్స్' లాంటి అద్భుతమైన బాలల చిత్రాలు చూసి  ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ ఈ మధ్యకాలంలో అలాంటి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాలల సినిమాలు రావడం బాగా తగ్గిపోయింది. ధీరజ్ మళ్లీ ధైర్యం చేసి ఆ జానర్‌లో ఈ 'సమ్మర్ హాలిడేస్' చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని  ధీరజ్ నాకు ముందే వినిపించాడు, వినగానే నాకు విపరీతంగా నచ్చింది. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో మెప్పించిన సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి ఈ చిత్రానికి కూడా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. 


Also read: Vadde Naveen: వడ్డే నవీన్ రీఎంట్రీ సెకండ్ మూవీ.. ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు ప్లాప్ కదా!


ఈ రోజుల్లో క్రష్ అంటే ఒక వ్యక్తి అనుకుంటారు. కానీ మీ కెరీర్‌నే మీ మొదటి క్రష్‌గా మార్చుకోండి. మన లైఫ్, కెరీర్ బాగుంటే ఏ క్రష్ అయినా మన వెనకాలే రావాల్సిందే. నా  సోదరుడు లాంటి ఆనంద్ దేవరకొండకు, ప్రొడ్యూసర్ ధీరజ్‌కి  ఈ మూవీ 100 శాతం పెద్ద సక్సెస్ ఇవ్వాలి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పాడు.

 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com